Today Events, March 26, 2023
*మహానందిలో నేడు టీటీడీ సత్రం నిర్మాణానికి భూమి పూజ చెయ్యనున్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి
*నేడు రాజమండ్రి – కొవ్వూరు రోడ్ కం రైల్వే వంతెన పై రాకపోకలు నిలిపివేత..ఈ ఉదయం 6 నుంచి సాయంత్రం 6వరకు రోడ్ కం రైల్ బ్రిడ్జి పై వాహనాల రాక పోకలు నిలిపి వేత
*నేడు కర్నూలు జిల్లాలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన.. కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలో నదీ స్నానం, శ్రీ లలితా సంగమేశ్వర స్వామిని దర్శించుకోనున్న మోహన్ భగవత్… గోకవరంలో పుల్లారెడ్డి జి పుల్లారెడ్డి చారిటీని సందర్శించనున్న మోహన్ భగవత్
*విశాఖనగరంలో G20 సదస్సుల సందడి….బీచ్ రోడ్డులో 3,5,10కి.మీ మారథాన్….సాయంత్రం ఆర్కే బీచ్ లో వైజాగ్ కార్నివాల్….ఈనెల 28,29,30 తేదీల్లో G 20 సదస్సులు….తరలిరానున్న 46దేశాల ప్రతినిధులు …..మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరగనున్న సమావేశాలు…విదేశీ ప్రతినిధుల సమావేశానికి సీఎం హాజరయ్యే అవకాశం
* విశాఖలో రాహుల్ గాంధీకి మద్దతుగా నేడు కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్ష…జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేపట్టే దీక్షలో పాల్గొననున్న ముఖ్య నాయకులు
* పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం అయినపర్రులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
* ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అధ్వర్యంలో విజయవాడ గాంధీ విగ్రహం దగ్గర నేడు కాంగ్రెస్ నేతల నిరసన..రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై నిరసన కార్యక్రమం
*నేడు సంగారెడ్డి నియోజకవర్గ BRS కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం..ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న MLC వెంకట్రామిరెడ్డి
* నేడు దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన..నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
