Site icon NTV Telugu

Whats Today ఈరోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

Today Events April 26, 2023

*ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం..తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ భవన్లు…ఏపీ ప్రభుత్వం తరఫున హాజరుకానున్న ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, రావత్ , ప్రేమ చంద్రారెడ్డి.. తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరుకానున్న రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్

*కడపలో నేడు పలు ప్రాంతాల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటన….కడప వైసీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఎంపీ.. అనంతరం మైదుకూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎంపీ అవినాష్ రెడ్డి

*విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో‌ విజయనగరం జిల్లా విద్యార్థినులకు‌ నేడు “కెపాసిటీ బిల్డింగ్ మరియు పర్సాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్”..ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితర ప్రముఖులు హాజరు

* నేడు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల బహిరంగ సభ….పాల్గొననున్న బీవీ రాఘవులు,నారాయణ

* విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం..ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజనీ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే లు,ప్రజాప్రతినిధులు

* నేడు కోడుమూరులో హంద్రీనది తీరాన వున్న తాగునీటి పధకాలను పరిశీలించనున్న నీటిపారుదల శాఖ అధికారులు

Read Also: Prakash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

*తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉండనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

* తిరుపతి జిల్లా పెనుమూరు మండలంలో చేనేత కార్మికులకు మగ్గముల పరికరాలను పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎంపీ రెడ్డప్ప

* తిరుమలలో ఇవాళ ,రేపు వసతి గదుల కోటాను ఆన్ లైన్ లో విడుదల చెయ్యనున్న టీటీడీ..ఇవాళ తిరుపతిలోని వసతి గదులు కోటాను..రేపు తిరుమలలోని వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టీటీడీ

* నేడు తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న వసతి దీవెన కింద 2022-2023  సంవత్సరానికి గాను 32,078  విద్యార్థులకు చెందిన 28,769 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు రు.30.58 కోట్లు జమ

* అనంతపురం జిల్లా నార్పల మండలంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమం ప్రారంభించనున్న సిఎం జగన్…రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్న సిఎం.

* ఈనెల 28న క‌డ‌ప జిల్లాకు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ ప‌ర్యట‌న ఖ‌రారు. ఒంటిమిట్ట కోదండ రామ‌స్వామి ఆల‌యం, అమీన్ పీర్ ద‌ర్గాను ద‌ర్శించుకోనున్న గ‌వ‌ర్న‌ర్‌.

*నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. పాల్గొననున్న వివిధ పార్టీల నేతలు… ప్రజాప్రతినిధులు

* వరంగల్ లో పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ బెయిల్ రద్దుపై నేడు కొనసాగనున్న వాదనలు.. బండి సంజయ్ బెయిల్ రద్దు పై పిటిషన్ వేసిన ప్రభుత్వ లాయర్

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన..జిల్లాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించనున్న మంత్రి

* శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సదస్యం..ఉదయం సూర్యప్రభ వాహన సేవలో, సాయంత్రం హంస వాహన సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

*ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనున్న స్పెషల్ కోర్ట్.. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో సిసోడియా బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న స్పెషల్ కోర్ట్

Exit mobile version