Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

What's Today Ntv

What's Today Ntv

నేడు విజయవాడ సబ్ జైలు నుంచి విడుదల కానున్న లిక్కర్ స్కాం కేసు నిందితులు.. కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు నిన్నే బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు

నేడు రాజమండ్రి పుష్కర్ ఘాట్లో వినూత్నంగా సాగనున్న ‘శుభంకర మహా గణపతి’ నిమజ్జనం.. శుభాలు కల్గించే నూలుపోగులతో కొలువుదీరిన వినాయకుడు.. 99 వేలు నూలు పోగులతో కొలువైన వినాయకుడి విగ్రహం.. ఈ విగ్రహం నూలుపోగులను ప్రసాదంగా భక్తులకు పంపిణీ

చంద్రగ్రహణం కారణంగా ఇవాళ 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేత.. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రేపు ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేత

నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు మూసివేత.. మధ్యాహ్నం 1 గంట నుండి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేత.. ఆర్జిత, పరోక్షసేవలు, శ్రీస్వామివారి అమ్మవార్ల కల్యాణోత్సవం నిలుపుదల

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంను మూసివేయనున్న ఆలయ అధికారులు.. ఉదయం 11.25 గంటలకు మూసివేసి గ్రహణ మోక్షం.. సోమవారం ఉదయం తెల్లవారు జామున ఉదయం 3.45 గంటల వరకు ఆలయ మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడి

సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిఆలయం మూసివేత.. మధ్యాహ్నం స్వామి వార్లకు మహా నివేదన అనంతరం 1 గంటకు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేత.. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, గ్రహణ శాంతి, హోమ పూజలు.. ఉదయం 9.30 నుండి భక్తుల దర్శనాలకు అనుమతి

ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంపై ఎంపీలకు వర్క్ షాప్, మాక్ పోలింగ్.. ఎల్లుండి జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఇవాళ ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు కొనసాగనున్న వర్క్ షాప్.. పార్లమెంట్ హౌస్‌లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద బారులు తీరిన గణనాధులు.. భారీ టస్కర్ వాహనాలతో నిండిపోయిన రోడ్లు..నిమజ్జన ప్రక్రియ త్వరగా ముగించేందుకు పోలీసుల కసరత్తు.. వచ్చే ప్రతి వాహనాన్ని ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టిన పోలీసులు

యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధం.. టాప్‌ సీడ్‌ సినర్‌తో అమీతుమీ తేల్చుకోబోతున్న రెండో సీడ్‌ అల్కరాస్‌

ఆసియా కప్‌ 2025 కోసం ఇప్పటికే దుబాయ్‌లో అడుగుపెట్టిన భారత జట్టు.. ఐసీసీ అకాడమీలో నెట్స్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా ప్లేయర్స్.. నేడు కూడా కొనసాగనున్న సాధన

Exit mobile version