Mamata Banerjee: ఈద్ ఉల్ ఫితార్ సందర్భంగా ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాట్ కామెంట్స్ చేసింది. కోల్ కతాలోని రెడ్ రోడ్డులో ఉన్న మసీదుకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. బెంగాల్ లో శాంతి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ కోరారు. తమకు హింస వద్దన్నారు. దేశంలో విభజన వద్దన్నారు. దేశాన్ని విభజించాలని కోరుకుంటున్నవారికి.. ఈద్ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నానని.. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తానని.. కానీ దేశాన్ని విభజన కానివ్వన్నారు.
Also Read : SI Absconded: గంజాయి కేసులో పట్టుబడిన ఎస్సై.. ఏఎస్పీ కార్యాలయం నుంచి పరారీ
మీరంతా ప్రశాంతంగా ఉండాలని.. ఎవరి మాటలు వినిపించుకోవద్దు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఓ గద్దార్ పార్టీతో పోరాటం చేస్తున్నానని.. కేంద్ర ఏజెన్సీలతోనూ ఫైట్ చేస్తున్నానని.. తనలో ధైర్యం ఉంది కాబట్టి పోరాడుతన్నానని ఆమె చెప్పారు. తాను తల వంచేది లేదని దీదీ అన్నారు. బీజేపీ నుంచి కొందరు డబ్బులు తీసుకుని.. ముస్లిం ఓటర్లను చీల్చుతారని కొందరంటుంటారని.. బీజేపీ కోసం ముస్లిం ఓట్లను చీల్చే ధైర్యం వాళ్లకు లేదని ఆమె అన్నారు.
Also Read : MS Dhoni : ఇదే నా చివరి ఐపీఎల్ కావొచ్చు..
ఒక వేళ ప్రజాస్వామ్యం వెళ్లిపోతే.. అప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్లిపోతారని.. ఇవాళ రాజ్యాంగాన్ని మార్చేశారని, చరిత్రను కూడా మార్చే వేసేందుకు కుట్ర జరుగుతుందని మమతా బెనర్జీ అన్నారు. వాళ్లు ఎన్ఆర్సీ తీసుకువచ్చారని.. ఆ పని చేయనీయనని వాళ్లకు చెప్పినట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ముస్లింలకు తాను అండగా ఉంటానని సీఎం భరోసా ఇచ్చారు.
