ABVP Bandh : నేడు తెలంగాణలో పాఠశాలల బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తెలంగాణలో పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలునిచ్చింది. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల బంద్‌కు పిలుపునిస్తూ.. అందుకే హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. బుధవారం పని చేయని రోజు అని పేర్కొంటూ హైదరాబాద్‌లోని పాఠశాలలు వాట్సాప్ సందేశాల ద్వారా తల్లిదండ్రులకు సెలవు నోటీసులు పంపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపును అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జి జీవన్ డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
Also Read
- Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా 'జో రూట్' ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
- Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
- Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
- Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
తాజావార్తలు
-
Sumanth: ‘నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..’ అంత మాట అనేశాడేంటి?
-
Joe Root: ఇంగ్లండ్ కెప్టెన్‌గా ‘జో రూట్’ ఫిక్స్.. హెడ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్.!
-
Anganwadi Recruitment: అంగన్వాడీ ఉద్యోగాల నియామకం.. ఆ జిల్లాలకు మంత్రి సీతక్క డెడ్‌లైన్..
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!