NTV Telugu Site icon

Today (23-12-22) Stock Market Roundup: వారాంతం ఘోరాతిఘోరం. స్టాక్ మార్కెట్ ‘వీక్’ ఎండ్

Today (23 12 22) Stock Market Roundup

Today (23 12 22) Stock Market Roundup

Today (23-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ఘోరాతిఘోరంగా అంతమైంది. వరుసగా నాలుగో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం సైతం భారీ నష్టాలను మూటగట్టుకుంది. అసలే గ్లోబల్‌ ఇన్వెస్టర్ల మూడ్‌ ఏమాత్రం బాగలేకపోవటం, దీనికి కొవిడ్‌-19 భయాలు తోడవటంతో షేర్ల కొనుగోళ్లు నిల్‌.. స్టాక్స్‌ విక్రయాలు ఫుల్‌.. అన్నట్లుగా ఈ రోజంతా కొనసాగింది.

రెండు సూచీలు కూడా అనూహ్యంగా బెంచ్‌ మార్క్‌లను బ్రేక్‌ చేసి డౌన్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 980 పాయింట్లు కోల్పోయి 60 వేల మార్క్‌ దిగువన.. అంటే.. 59 వేల 845 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్‌ 28 తర్వాత ఇంత తక్కువగా నమోదుకావటం ఇదే తొలిసారి. నిఫ్టీ 323 పాయింట్లు తగ్గిపోయి అత్యంత బలహీనంగా 17 వేల 803 పాయింట్ల క్లోజ్‌ అయింది.

read also: Today (23-12-22) Business Headlines: ‘చిత్ర’కు బెయిలు.. అయినా జైలు. మరిన్ని ముఖ్య వార్తలు..

సెన్సెక్స్‌లో టైటాన్‌ కంపెనీ షేర్లు నెగెటివ్‌ సెంట్‌మెంట్‌ని తట్టుకొని నిలబడగలిగాయి. కానీ.. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ పెద్దమొత్తంలో దెబ్బతిన్నాయి. నిఫ్టీలో పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల షేర్లు నిటారుగా ర్యాలీ తీసి ఒక్కసారిగా 6 శాతం పతనమయ్యాయి. మీడియా మరియు మెటల్‌ సూచీలు తీవ్రంగా నష్టపోయినవాటిలో టాప్‌లో ఉన్నాయి. వ్యక్తిగత స్టాక్స్‌ విషయానికొస్తే.. మోర్‌పెన్‌ ల్యాబ్స్‌ వరుసగా మూడో రోజు కూడా ప్రాఫిట్స్‌ పొందటం విశేషం.

ఈ సంస్థ షేర్ల విలువ 16 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం రేటు 114 రూపాయలు పెరిగి 54 వేల 635 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్‌ అయింది. కేజీ వెండి ధర 521 రూపాయలు లాభపడి 69 వేల 41 రూపాయలు పలికింది. రూపాయి పతనం కొనసాగుతోంది. ఇవాళ 12 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 80 పైసల వద్ద ఉంది.