Today (21-01-23) Business Headlines:
పెరిగిన విదేశీ మారక నిల్వలు
ఇండియా విదేశీ మారక నిల్వలు 10 పాయింట్ నాలుగు ఒకటి బిలియన్ డాలర్లు పెరిగి 572 బిలియన్ డాలర్లకు చేరాయి. తద్వారా ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. జనవరి 13వ తేదీ వరకు ఉన్న ఈ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఫారెక్స్ రిజర్వ్స్ ఈ రేంజ్‌లో పెరగటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. బంగారం నిల్వల్లో కూడా పెరుగుదల కొనసాగుతోంది. తాజాగా 1 పాయింట్ 1 సున్నా ఆరు బిలియన్ డాలర్లు పెరిగి 42 పాయింట్ ఎనిమిదీ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయి.
15% తగ్గిన రిలయెన్స్ లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని డిసెంబర్ త్రైమాసికంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 15 వేల 792 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గతేడాది ఇదే సమయంతో పోల్చితే 15 శాతం తక్కువ. తాజా త్రైమాసికంలో రిలయెన్స్ మొత్తం ఆదాయం 2 పాయింట్ 2 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలోని ఇలాగే మూడో త్రైమాసికంలో వచ్చిన ఆదాయం 1 పాయింట్ తొమ్మిది ఒకటి లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. రిలయెన్స్ ఆదాయం 15 శాతం పెరిగినప్పటికీ నికర లాభం 15 శాతం తగ్గటం గమనించాల్సిన విషయం.
గూగుల్‌లో 6% స్టాఫ్‌కి లేఆఫ్స్
గూగుల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు అన్ని దేశాల్లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో ఇది 6వ శాతానికి సమానం. తాజా నిర్ణయంతో ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిన కంపెనీల జాబితాలో గూగుల్ సంస్థ కూడా చేరినట్లయింది. ఇదిలాఉండగా నాలుగు ఐటీ దిగ్గజ సంస్థల్లోనే ఏకంగా 51 వేల మంది ఇంటికి పరిమితమయ్యారు. మైక్రోసాఫ్ట్ 10 వేల మందిని, అమేజాన్ 18 వేల మందిని, మెటా 11 వేల మందిని తీసేస్తున్నట్లు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ దేశాల్లోనూ రెడ్డీస్ మెడిసిన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ క్యాన్సర్ మందును అమెరికా, ఐరోపా మార్కెట్లలో విక్రయించనుంది. రిటుగ్జిమాబ్ బయోసిమిలర్ అనే ఈ మెడిసిన్‌కి సంబంధించిన అన్ని క్లినికల్ పరీక్షలను ఈ సంస్థ విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ఔషధాన్ని అమ్మేందుకు డాక్టర్ రెడ్డీస్ ఇండియా సహా 25 దేశాల్లో పర్మిషన్ తీసుకుంది. అమెరికా, ఐరోపా వంటి మార్కెట్లలో నియంత్రణలు ఎక్కువ. కాబట్టి ఈ క్యాన్సర్ మందుపై ఇంకొన్ని పరీక్షలు నిర్వహించాక విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపింది.
మోర్గాన్ స్టాన్లీ సీఈఓ శాలరీ కట్
తమ సంస్థ CEO జేమ్స్ గోర్మాన్ వేతనంలో మోర్గాన్ స్టాన్లీ 10 శాతం కోత విధించింది. తద్వారా 31 పాయింట్ 5 మిలియన్ డాలర్లకు తగ్గించింది. ఈ ప్యాకేజీలో 1 పాయింట్ 5 మిలియన్ డాలర్లు శాలరీ కాగా 7 పాయింట్ 5 మిలియన్ డాలర్లు క్యాష్ బోనస్ అని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. 2022వ సంవత్సరంలో సంస్థ లాభాలు పడిపోవటం మరియు కంపెనీ స్టాక్స్ వ్యాల్యూ కూడా పతనం కావటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జేమ్స్ గోర్మాన్‌కి ఇచ్చే పే ప్యాకేజీలో మేజర్ భాగం 22 పాయింట్ 5 మిలియన్ డాలర్లను ఈక్విటీ లింక్డ్ అవార్డ్స్ రూపంలో.. అంటే.. షేర్లలో చెల్లిస్తారు.
సీలింగ్ ఫ్యాన్ల సెగ్మెంట్‌లోకి ‘కెంట్’
వాటర్ ప్యూరిఫయర్ పరికరాల సంస్థ కెంట్ RO సిస్టమ్స్ ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కూల్ అనే బ్రాండ్ నేమ్‌తో సీలింగ్ ఫ్యాన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. BLDC టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫ్యాన్లు జనరల్ సీలింగ్ ఫ్యాన్ల కన్నా 65 శాతం తక్కువ కరెంట్‌ను వినియోగించుకుంటాయని సంస్థ పేర్కొంది. ఈ కూల్ బ్రాండ్ ఫ్యాన్లలో వైఫై మరియు IOT తదితర సాంకేతికతలను పొందుపర్చారు. రిమోట్ మరియు మొబైల్ ఫోన్లతో కూడా ఈ ఫ్యాన్లను కంట్రోల్ చేయొచ్చని కెంట్ ఆర్‌వో సిస్టమ్స్ CMD మహేశ్ గుప్తా చెప్పారు.