NTV Telugu Site icon

Today (17-02-23) Business Headlines: రైల్ పోస్ట్ కార్గో సర్వీస్ ప్రారంభం. మరిన్ని వార్తలు

Today (17 02 23) Business Headlines

Today (17 02 23) Business Headlines

Today (17-02-23) Business Headlines:

హైదరాబాదులో బయోఏషియా సదస్సు

హైదరాబాద్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బయోఏషియా సదస్సు జరగనుంది. HICC నొవాటెల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్టార్టప్‌ స్టేజ్‌ పెవిలియన్‌.. సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది. హెల్త్‌ మరియు బయాలజీ సెగ్మెంట్‌లో స్టార్టప్‌లను ఎంకరేజ్‌ చేయాలనే టార్గెట్‌తో ఈ పెవిలియన్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగపూర్‌, థాయ్‌లాండ్‌, అమెరికా, ఐర్లాండ్‌, బ్రిటన్‌ తదితర దేశాలకు చెందిన 400 స్టార్టప్‌లు అప్లై చేయగా 75 స్టార్టప్‌లను మాత్రమే సెలెక్ట్‌ చేశారు. ఆయా సంస్థలే తమ ప్రొడక్టులను, సర్వీసులను ఈ పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచుతాయి.

యూట్యూబ్ సీఈఓగా నీల్ మోహన్

యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జ్‌గ్యూటివ్‌ ఆఫీసర్‌గా ఫేమస్‌ ఇండియన్‌ అమెరికన్‌ నీల్‌ మోహన్‌ నియమితులయ్యారు. గడచిన తొమ్మిదేళ్లుగా ఈ పదవిలో ఉన్న సూసన్‌ వోజ్‌సికి వైదొలగనుండటంతో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. సూసన్‌ వోజ్‌సికి.. హెల్త్‌, ఫ్యామిలీ, పర్సనల్‌ ప్రాజెక్టులపై ఫోకస్‌ పెట్టేందుకు తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం యూట్యూబ్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్న నీల్‌ మోహన్‌ ప్రమోషన్‌ పొందుతున్నారు. యూట్యూబ్‌ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ అనే సంగతి తెలిసిందే. దీనికి భారతీయ మూలాలున్న వ్యక్తి సారథ్యం వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

విదేశీ విరాళాలపై పెరగనున్న నిఘా

విదేశాల నుంచి ఇండియాకి అందుతున్న విరాళాలపై ఇక మరింత నిఘా పెరగనుంది. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏరోజుకారోజు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం.. విదేశీ విరాళాల వివరాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. డైలీ.. కేంద్ర హోం శాఖకు సమర్పించాలి. ఈ మేరకు ఎస్‌బీఐ.. నెఫ్ట్‌ మరియు ఆర్‌టీజీఎస్‌ వ్యవస్థల్లో మార్పులు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్టం చేసింది.

విశాఖ కంటే గంగవరం పోర్ట్ బెటర్

తన ఎల్‌పీజీ దిగుమతులను అదానీ సంస్థకు అప్పగించటం పట్ల వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ రంగ సంస్థ వివరణ ఇచ్చింది. విశాఖ రేవుకు బదులుగా అదానీ గ్రూపు నిర్వహణలోని గంగవరం పోర్టును ఎందుకు సెలక్ట్‌ చేసుకోవాల్సి వచ్చిందో వివరించింది. విశాఖ రేవు కంటే గంగవరం బెటర్‌ అని అభిప్రాయపడింది. గంగవరం పోర్టుకు పెద్ద ట్యాంకర్లు వచ్చే వీలుందని, అంతేకాకుండా.. అక్కడ మెరుగైన సౌకర్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. విశాఖ పోర్టుతో పోల్చితే గంగవరంలో ఎల్‌పీజీ దిగుమతికి సమయం కలిసొస్తుందని, దీనివల్ల డెమరేజ్‌ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరంలేదని వెల్లడించింది.

రైల్ పోస్ట్ కార్గో సర్వీస్ ప్రారంభం

ఇండియన్‌ రైల్వేస్‌ మరియు ఇండియా పోస్ట్‌.. జాయింట్‌ పార్సిల్‌ సర్వీసును గురువారం ప్రారంభించాయి. రైల్‌ పోస్ట్‌ గతిశక్తి ఎక్స్‌ప్రెస్‌ కార్గో సర్వీస్‌ పేరిట అధికారికంగా ఆరంభించాయి. గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా పార్సిళ్లను నేరుగా మరియు నిరాటంకంగా రవాణా చేసేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసు ప్రస్తుతం నాలుగు సెక్టార్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో.. హైదరాబాద్‌ టు హజ్రత్‌ నిజాముద్దీన్‌ రూట్‌ కూడా ఉండటం గమనించాల్సిన అంశం.

వసంత్ ప్రభు త్వరలో రిటైర్‌మెంట్

పేమెంట్ల రంగంలో దిగ్గజ సంస్థ అయిన వీసా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వసంత్‌ ప్రభు రిటైర్‌ అవుతున్నారు. 63 ఏళ్ల వసంత్‌ ప్రభు ఈ కంపెనీ ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌లో.. అంటే.. సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. 2015 నుంచి ఈయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. సంస్థను భారీ లాభాల్లోకి తీసుకెళ్లారు. వీసా నెట్‌వర్క్‌లో పేమెంట్ల సంఖ్యను రెట్టింపు చేశారు. ఈ విషయంలో తనకు ఎంతో సంతృప్తిగా, గర్వంగా ఉందని చెప్పారు. తన రిటైర్‌మెంట్‌ అనంతరం కూడా వీసా సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వసంత్‌ ప్రభు.. వీసా వైస్‌ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు.

Show comments