NTV Telugu Site icon

Today (12-01-23) Business Headlines: దేశంలోనే తొలి సోలార్ కారు. మరిన్ని వార్తలు.

Today (12 01 23) Business Headlines

Today (12 01 23) Business Headlines

Today (12-01-23) Business Headlines:

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భేష్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి. 10 నెలల్లో 14 పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది 86 పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి సమానం. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లకి సంబంధించి పోయినేడాదితో పోల్చితే ఇది దాదాపు పాతిక శాతం ఎక్కువ. ఈ వివరాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వెల్లడించింది.

‘రూపే, భీమ్’లకు ప్రోత్సాహం

రూపే డెబిట్ కార్డ్ మరియు భీమ్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2 వేల 600 కోట్ల రూపాయలు ప్రకటించింది. తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి 1300 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ ‘బడ్జెట్’ను ఇప్పుడు రెట్టింపు చేసింది. రూపీ డెబిట్ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్ మరియు ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్లు ఎక్కువ నిర్వహించే బ్యాంకులకు ఈ పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాలను అందించనున్నారు. లో వ్యాల్యూ భీమ్ UPI లావాదేవీలు అధికంగా జరిగే బ్యాంకులకూ ఇది వర్తిస్తుంది.

ఎస్బీఐ ఎండీగా మరో 2 ఏళ్లు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా చల్లా శ్రీనివాసులు శెట్టి పదవీ కాలాన్ని సెంట్రల్ గవర్నమెంట్ రెండేళ్లు పొడిగించింది. ఈ నిర్ణయం ఈ నెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మేరకు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో SBI పేర్కొంది. చల్లా శ్రీనివాసులు శెట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించింది.

ఆస్తులన్నీ అమ్మి దానం చేస్తా

ఇప్పటికే బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఇకపై తన ఆస్తులన్నీ అమ్మి ఆ డబ్బును కూడా సోషల్ సర్వీసులకే కేటాయిస్తానని ప్రకటించారు. రెడ్డిట్ అనే కమ్యూనిటీస్ నెట్ వర్కులో ఏడాదికొకసారి నిర్వహించే ఆస్క్ మి ఎనీథింగ్ ‘సెషన్’లో ఈ విషయం వెల్లడించారు. గొప్ప మానవతావాది అయిన మీరు వేల ఎకరాల భూమిని కలిగి ఉండటం కాంట్రాడిక్టరీగా అనిపించట్లేదా అన్న ప్రశ్నకు బిల్ గేట్స్ పైవిధంగా జవాబు చెప్పారు.

10 దేశాల NRIలకు యూపీఐ

ఆన్ లైన్ చెల్లింపులకు సంబంధించి ఇండియాలో సూపర్ హిట్ అయిన యూపీఐ సదుపాయం ఇప్పుడు 10 దేశాల్లోని NRIలకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ దేశాల జాబితాలో అమెరికా, కెనడా, UAE, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్ డమ్ ఉన్నట్లు తెలిపింది. NRI లేదా NRO అకౌంట్ల నుంచి మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఏప్రిల్ లోగా చర్యలు చేపట్టాలని ఆర్థిక సంస్థలకు సూచించింది.

Auto Expo ఘనంగా ప్రారంభం

గ్రేటర్ నోయిడాలో Auto Expo-2023 నిన్న బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఎక్కువ శాతం విద్యుత్ వాహనాలు ఆకట్టుకున్నాయి. కాన్సెప్ట్ కార్లు, బైక్ లు, ట్రక్ లు, బస్ లు, సైకిళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సౌర శక్తితో నడిచే కారును వాయ్ వే మొబిలిటీ సంస్థ ప్రదర్శించింది. ఎవా అనే పేరుతో పిలిచే ఈ వాహనం దేశంలోనే మొట్టమొదటి సోలార్ కారు అని ఆ సంస్థ పేర్కొంది. ‘ఆంధ్రప్రదేశ్’లోని ప్లాంట్ విద్యుత్ కార్ల తయారీకి రెడీగా ఉందని కియా కంపెనీ తెలిపింది.