Site icon NTV Telugu

Today (06-02-23) Stock Market Roundup: బెదిరే ఆరంభం

Rrrrr

Rrrrr

Today (06-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈవారం శుభారంభం లభించలేదు. రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం నష్టాలతోనే ప్రారంభమై నష్టాలతోనే ముగిశాయి. ఐటీ షేర్లలో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవటంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌లు నెగెటివ్‌ జోన్‌లో కదలాడాయి. అయితే.. BROADER మార్కెట్లు మాత్రం మంచి పనితీరు కనబరిచాయి. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ హండ్రెడ్‌, స్మాల్‌క్యాప్‌ హండ్రెడ్‌ సున్నా పాయింట్‌ 7 శాతం వరకు పెరిగాయి. చివరికి.. సెన్సెక్స్‌ 335 పాయింట్లు కోల్పోయి 60 వేల 506 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. 89 పాయింట్లు తగ్గి 17 వేల 764 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయింది. సెన్సెక్స్‌లో.. పీ అండ్‌ జీ హెల్త్‌ కేర్‌, రోసారి బయోటెక్‌, వొడాఫోన్‌ ఐడియా బాగా వెనకబడ్డాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీలో మీడియా, ఫార్మా సూచీలు సున్నా పాయింట్‌ 6 శాతం వరకు లాభపడ్డాయి.

read more: Cinema Theatres: ప్రతి ముగ్గురిలో ఒకరి చూపు థియేటర్‌ వైపు

నిఫ్టీలో మెటల్‌ ఇండెక్స్‌ ఘోరంగా దెబ్బతింది. రెండు శాతానికి పైగా పతనమైంది. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. ఐటీసీ షేర్లు రెండు శాతం లాభాలను ఆర్జించాయి. తద్వారా ఒక్కో స్టాక్‌ వ్యాల్యూ సరికొత్త విలువకు.. అంటే.. 388 రూపాయలకు పైగా నమోదు కావటం విశేషం. మహింద్రా అండ్‌ మహింద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు 10 శాతం ర్యాలీ తీశాయి. ఫలితంగా రెండేళ్ల గరిష్ట విలువ అయిన 267 రూపాయలకు పైగా చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం ధర 401 రూపాయలు పెరిగింది.

అత్యధికంగా 56 వేల 986 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు 189 రూపాయలు పెరిగి గరిష్టంగా 67 వేల 765 రూపాయలుగా నమోదైంది. క్రూడాయిల్‌ ధరలో పెద్దగా మార్పులేదు. అత్యంత స్వల్పంగా 9 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 6 వేల 88 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 81 పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 75 పైసల వద్ద స్థిరపడింది.

Exit mobile version