Site icon NTV Telugu

Tobacco Packet: బెల్లంలో నిషేధిత పొగాకు ప్యాకెట్.. దుర్గదేవి భక్తుల ఆగ్రహం

Tobaco

Tobaco

Tobacco Packet: దుర్గదేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి నైవేద్యం కోసం తయారు చేస్తున్న పాయసంలో బెల్లం ముక్కల మధ్య నిషేధిత పొగాకు (అంబర్) ప్యాకెట్ బయటపడటం భక్తులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో జరిగింది. అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారికి అన్న ప్రసాదం పెట్టేందుకు భక్తులు పరవాన్నం (పాయసం) సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో బెల్లాన్ని కరిగించేందుకు ప్రయత్నిస్తుండగా దాని మధ్యలో అంబర్ ప్యాకెట్ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని విప్పి చూడగా అందులో నిషేధిత పొగాకు బయటపడింది. దీంతో దుర్గ మాల ధరించిన భక్తులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Snake Surgery: గాయపడిన పాముకి ఆపరేషన్ చేసి ప్రాణం నిలబెట్టిన వెటర్నరీ డాక్టర్

ఈ బెల్లాన్ని గోదావరిఖని సమీపంలో ఉన్న కోటి వద్ద ఉన్న షాపుల్లో కొనుగోలు చేసినట్లు భక్తులు తెలిపారు. వారు ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ అధికారులకు, పాటు ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, బెల్లం విక్రయించే షాపులపై తనిఖీలు చేపట్టాలని కోరారు. ఇది కేవలం ఒక ప్రసాదం విషయం కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు భక్తులు.

Inter Board : వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ సిలబస్ మార్పు

Exit mobile version