ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అది ముగిసిన వెంటనే, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్ అంటే ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు చేదు వార్త వచ్చింది. గత సీజన్ వరకు, అభిమానులు జియో సినిమాలో మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించారు. కానీ ఈ సీజన్‌లో అది కుదరదు. ఇప్పుడు అభిమానులు ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి డబ్బుల కట్టాల్సిందే. ఎందుకంటే.. డిస్నీ + హాట్‌స్టార్, జియో సినిమా IPL 2025 కి ముందు విలీనం అయ్యాయి. ఇప్పుడు రెండింటి పేర్లను కలిపి ఒక యాప్‌ను ప్రవేశపెట్టారు. కొత్తపేరు జియో హాట్‌స్టార్ గా మారింది. ఈ యాప్‌లో అభిమానులు కొన్ని నిమిషాలు మాత్రమే ఐపీఎల్ మ్యాచ్‌ను ఉచితంగా చూడగలరు.
READ MORE: Bhagwant Mann: అమెరికా విమానం అమృత్‌సర్‌కి రావడంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
కానీ మొత్తం మ్యాచ్ చూడటానికి మీరు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. రూ.149 వ్యాలిడిటీ 3 నెలలు. సంవత్సరం మొత్తం సబ్‌స్క్రిప్షన్ పొందాలంటే.. రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాను కేవలం ఫోన్‌కి మాత్రమే వర్తిస్తాయి. అంతే కాకుండా.. రూ.299తో ప్లాన్ తీసుకుంటే.. రెండు డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ఏడాదికి పొడిగించాలంటే రూ.899 చెల్లించాలి. దీంతో పాటు మ్యాచ్ మధ్యలో ప్రకటనలు రాకుండా వీక్షించే ప్లాన్‌లను కూడా జియోహాట్‌స్టార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కూడా రెండు ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.299 సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే.. మూడు నెలల పాటు యాడ్స్ చేకుండా వీక్షించవచ్చు. ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499. ఈ ప్రీమియం ప్లాన్లతో నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2025 సీజన్ మార్చిలో మొదలవుతుందన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. రెండవ మ్యాచ్ గత సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు.