Police Serious Warning: బర్త్‌డేలు వచ్చాయంటే చాలు.. ఇప్పటి యువత రోడ్లపై హంగామా చేస్తోంది.. ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్లపై కేక్ కటింగ్‌లు, బాణాసంచా పేల్చడాలు.. ఇలా నానా రచ్చ చేస్తున్నారు.. అయితే, తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి వేకువజామున మూడు గంటల వరకు.. ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై కేక్‌లు కట్ చేసినా.. పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Read Also: Astrology: ఏప్రిల్ 21, సోమవారం దినఫలాలు
ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తిరుపతిలో డీఎస్పీ భక్తవత్సలం ప్రత్యేక చొరవ తీసుకుని ఈస్ట్, యూనివర్శిటీ పరిధిలో రెండు కేసులు నమోదు చేయించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా తిరుపతి సబ్ డివిజన్ పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. ఆదివారం నుంచి తిరుపతి లోని మధురానగర్, ఇర్లానగర్, బైరాగిపట్టెడ, ఎస్టీవీనగర్, శివజ్యోతినగర్, సత్యనారాయణపురం, రైల్వే కాలనీ, ఉపాధ్యాయనగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలున్నట్లు గుర్తించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒకటికి రెండు సార్లు చెప్పినా మాట వినకుంటే కేసులు నమోదు చేయనున్నారు.. అలా రోడ్డుపై ఖాళీగా తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు..
Read Also: Tirumala Sri Vari Mettu: డబ్బులు రిటన్ ఇవ్వాల్సి వస్తుందని రాష్ డ్రైవింగ్.. 13 మంది భక్తులకు గాయాలు!
