Tirupati National Sanskrit University: తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీ దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి.. ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. గత కొన్ని నెలలుగా విద్యార్థినితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలు మరొక అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి రికార్డు చేశాడు… సెల్ ఫోన్ లో రికార్డు చేసి విద్యార్థిని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం.. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇన్‌ఛార్జీ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు.. ఇద్దరు ప్రొఫెసర్లపై కేసు నమోదు చేశారు.. సెల్ ఫోన్ సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్ళిపోంది.
READ MORE: Goa: గోవాలోని ప్రముఖ నైట్‌క్లబ్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి
