Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు..

Tirumala

Tirumala

తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు వేద ఆశీర్వాచనం అందజేసి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టిన నేను.. అంచెలంచెలుగా ఏదుగుతూ వచ్చాను అని ఆయన పేర్కొన్నారు. 2003లో గరుడ సేవ రోజు 24 క్లైమర్ మైన్లుతో దాడి జరిగినప్పుడు కూడా వేంకటేశ్వర స్వామే ప్రాణ భిక్ష పెట్టారు.. మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు శ్రీవారిని ప్రార్దించాను.. అందుకు అనుగుణంగా ఆయన దర్శనం తరువాతే మిగిలిన కార్యక్రమాలను ప్రారంభిస్తాను అంటూ బాబు చెప్పుకొచ్చారు. నేను కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలందరు సంఘీభావం ప్రకటించారు.. 45 సంవత్సరాలుగా ప్రజా సేవలో వున్నారు.. నా సంకల్పం ప్రపంచ పఠంలో భారత దేశం.. భారత దేశంలో తెలుగు ప్రజలు అగ్రగామిగా వుండాలి అని కోరుకున్నాను.. భవిష్యత్త్ కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తాను అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Read Also: Mother Dead Body: ఏడాది కాలంగా.. తల్లి శవంతోనే జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు!

ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా కొనసాగుతుంది. క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉంన్నారు. నిన్న (గురువారం) అర్ధరాత్రి వరకు 58,278 మంది స్వామివారిని దర్శించుకోగా 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించున్నారు. ఇక, స్వామివారికి కానుకల రూపంలో హుండీలో దాదాపు 3.53 కోట్ల రూపాయలు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం కొనసాగుతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 4 గంటల్లో దర్శనం అవుతుంది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం కొనసాగుతుంది.

Exit mobile version