Site icon NTV Telugu

Air India CEO: ఎయిర్ ఇండియా సీఈఓతో తిరుపతి ఎంపీ గురుమూర్తి భేటీ

Tirupathi Mp

Tirupathi Mp

Air India CEO: ఢిల్లీలో నేడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్‌ను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకు శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కువైట్‌కు నేరుగా ఎయిర్ ఇండియా ద్వారా అంతర్జాతీయ విమానాలు నడపాలని అభ్యర్ధించారు.

Also Read: TG Viswaprasad: పవన్ రెమ్యూనిరేషన్.. ప్రపంచంలో ఎవడికి అడిగే హక్కు లేదు

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇటీవలి కాలంలో పెరుగుతున్న ప్రజాదరణ గురించి ఆయనకి చెబుతూ అంతర్జాతీయ విమానాలు నడపడం వలన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయనకి వివరించారు. అందుకు ఎయిర్ ఇండియా సీఈఓ అలోక్ సింగ్ సానుకూలంగా స్పందించారని త్వరలో కొత్త విమానాలు రానున్నాయని సెప్టెంబర్ నుండి జనవరి మధ్యలో తిరుపతి నుండి కువైట్ కి విమానం నడిపేందుకు చర్యలు తీసుకొంటామని చెప్పారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.

Exit mobile version