Site icon NTV Telugu

Tragedy : భర్తపై మరిగే నూనె పోసిన భార్య..

Acid Attack

Acid Attack

Tragedy : తిరునల్వేలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తపైనే కాచి వడబోసిన నూనె పోసి అత్యంత దారుణంగా గాయపరిచింది ఓ భార్య. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రగిలిపోయిన భార్య, క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ బాలుసుబ్రమణియన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణపురానికి చెందిన 42 ఏళ్ల బాలుసుబ్రమణియన్ ఆటో డ్రైవర్. అతని భార్య మత్తలక్ష్మి (34). ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. చాలా కాలంగా భర్త బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని మత్తలక్ష్మి అనుమానిస్తోంది.

Maoists : ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు

ఈ విషయమై గతంలో అనేకసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 25 రోజుల క్రితం కూడా తీవ్రంగా గొడవపడి, పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది మత్తలక్ష్మి. ఈ వివాదం నెల్లై మహిళా పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, రాజీ కుదిర్చారు. నాలుగు రోజుల క్రితమే మత్తలక్ష్మి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో, నిన్న (మే 30) ఉదయం మళ్ళీ భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన మత్తలక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్లి, స్టవ్‌పై మరుగుతున్న నూనెను తీసుకెళ్లి బాలుసుబ్రమణియన్ పై పోసింది.

మరుగుతున్న నూనె ఒంటిపై పడటంతో బాలుసుబ్రమణియన్ తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేశాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శివంతిపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మత్తలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో సంబంధం ఉందని మత్తలక్ష్మి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం, ఆవేశం ఒక కాపురాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?

Exit mobile version