Site icon NTV Telugu

Tirumala: 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala Hundi

Tirumala Hundi

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీనెల 100కోట్లకుపైగానే సమకూరుతూ వస్తోంది. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1398 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతి నెలా 100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జులై నెలలో అత్యధికంగా రూ.129 కోట్ల హుండీ ఆదాయం లభించింది. నవంబర్ నెలలో అత్యల్పంగా రూ.108 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిసింది.

Read Also: Political Heat In Kakinada: కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్‌.. గోదారి గట్టున గెట్‌ టుగెదర్

డిసెంబర్ నెలలో కూడా 100 కోట్ల మార్క్‌ని హుండీ ఆదాయం దాటినట్లు టీటీడీ వెల్లడించింది. వరుసగా 22వ నెల కూడా 100 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలిసింది. డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.116 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Exit mobile version