Site icon NTV Telugu

Tirumala Darshan: తిరుమల అలర్ట్.. స్వామి దర్శనార్థం పోటెత్తిన భక్తులు

Tirumala

Tirumala

Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దర్శనం క్యూలైన్లు నిండి వెలుపలకు వచ్చాయి. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు వారికి కేటాయించిన టైం నుంచి 6గంటల సమయం పడుతోంది. శుక్రవారం 61,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32,351 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

Read Also: Gudivada Amarnath: జనసేనను నాదెండ్ల బంగాళాఖాతంలో కలపడం ఖాయం

తిరుమలలో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద రేపు నిర్వహించవలసిన కార్తిక వనభోజనం కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రేపు వైభోవత్సవ మండపంలోనే ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించనుంది. అలాగే రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

Read Also: MS Dhoni Joins BJP Photo Viral: బీజేపీలోకి ఎంఎస్ ధోని.. పక్కా ప్లాన్ అదే

తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. భక్తులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేసి.. దీని ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి.

Exit mobile version