NTV Telugu Site icon

Tirumala Online Tickets: నేటి నుంచి ఆన్‌లైన్‌ లో జూన్ నెల ఆర్జిత సేవా టిక్కెట్లు..!

9 Thirumala

9 Thirumala

గురువారం ఉదయం జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటాను విడుదల‌ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు సంబంధించి ఆన్‌ లైన్‌ కోటాను తాజాగా టీటీడీ విడుదల చేసింది. గురువారం ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాకు సంబంధించిన టికెట్స్ ను ఆన్‌లైన్‌ లో విడుద‌ల చేస్తారు. అలాగే జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరగబోతున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో భక్తులు పాల్గొనేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

Also Read: Shobha Shetty : బిగ్ బాస్ వల్లే ఆ ఛాన్స్ మిస్ అయ్యాను.. మోనిత ఎమోషనల్ ..

ఇక మరోవైపు గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌ నుండి శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా లాంటి టికెట్లు, అలాగే ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను కూడా విడుద‌ల చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌ సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

Also Read: Telepathically -Elon Musk: మెదడులోని చిప్‌ సాయంతో చెస్‌ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!

ఇక ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సర్వసాధారణంగా ఉంది. బుధవారం నాడు స్వామివారిని 69,072 మంది భక్తులు దర్శించుకోగా.. అందులో స్వామివారికి 26,239 మంది తలనీలాలను సమర్పించారు. అలాగే స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లుగా లెక్కించబడింది. తిరుమలలో 11 కంపార్ట్ మెంట్లలో ఉచిత సర్వ దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే రూ. 300/- ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కేవలం 3 గంటల సమయం పడుతోంది.