Tirumala Cheetah: తిరుమల కాలినడక భక్తులకు ఊరట.. బోనులో చిక్కిన చిరుత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cheetah Caught in Cage at Tirumala: తిరుమల కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. తాజాగా తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత బోనులో చిక్కింది. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడవ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అది పెద్ద చిరుత అని, దాని వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి చంపేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. కాలినడక మార్గంలో వెళ్లే భక్తులు బయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అటవీ అధికారులు నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. పాద ముద్రల ఆధారంగా 5 చిరుతపులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read
- CJP: 'క్యా బోల్తీ పబ్లిక్'.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
- Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
- Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
Also Read: IND vs WI: ఐదో టీ20లో భారత్ పరాజయం.. విండీస్‌కు సిరీస్ సమర్పయామి! ఇదే తొలిసారి
లక్షిత మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో ఈరోజు తెల్లవారుజామున చిరుత చిక్కింది. చిన్నారిని చంపింది ఇదే చిరుత అని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ చిన్నారిపై చిరుత దాడి చేయగా.. దాన్ని బంధించి కల్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
తాజావార్తలు
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!