Site icon NTV Telugu

Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!

11

11

తిరుమల వెంకన్న స్వామి భక్తుల తాకిడి రోజురోజుకి ఎక్కువవుతుంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు కూడా సెలవులు రావడంతో స్వామి దర్శనానికి తిరుమలలో భక్తీ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనాలకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి మూడు నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also read: Konda Surekha: ఆరు హామీలపై మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన

నిజం కాలం నేపథ్యంలో వెంకన్న భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లను చేసినట్లు తాజాగా టీటీడీ తెలిపింది. ఈ విషయం సంబంధించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీ దర్శనాల తొలగింపుతో సామాన్య భక్తుల దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎన్నికల నిబంధనలో భాగంగా ఎన్నికల కోడ్ వల్ల ఇప్పటికే సిఫారసు లేఖలను రద్దు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Also read: Ravi Babu Family: విలన్ రవిబాబుకి హీరోయిన్ లాంటి కూతురు.. ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా?

బయట ఎండలు ఎక్కువగా ఉన్నా నేపథ్యంలో.. భక్తులకి టీటీడీ వారు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదం ఎక్కువగా అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మాడవీధుల్లో భక్తులు చెప్పులు లేకుండా నడిచడానికి ఇబ్బంది పడకుండా కూల్ పెయింటింగ్ తో పాటు తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో ఆయన తరచుగా శేషాచల అడవుల్లో జరిగే ఆకస్మిక అగ్నిప్రమాదాలను నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీశాఖ, ప్రభుత్వ అగ్నిమాపక శాఖ లకు సంబంధించి తగిన చర్యలు చేపట్టడానికి రెడీగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెబుతూ.. టీటీడీకి చెందిన పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు ఇప్పటికే కేవలం తిరుమల, తిరుపతిలో మాత్రమే కాకుండా టీటీడీ బుక్స్టాలలో అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై నగరాలలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Exit mobile version