Ravi Babu Family: విలన్ రవిబాబుకి హీరోయిన్ లాంటి కూతురు.. ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Babu Family Photo at Tirumala Goes viral: సీనియర్ నటుడు చలపతిరావు కుమారుడిగా రవిబాబు సినీ రంగ ప్రవేశం చేశాడు. నిజానికి ఆయన అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. అయితే సినిమా మీద ఆసక్తితో మళ్లీ తిరిగి వచ్చిన ఆయన దర్శకుడుగా సినిమాలు చేయాలి అనుకున్నా సరే ముందు నటుడిగానే కెరీర్ మొదలుపెట్టాడు. సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సహాయ పాత్రలు చేస్తూ చివరికి విలన్ స్థాయికి వెళ్ళాడు. అయితే 2002వ సంవత్సరంలో ఆయన అల్లరి అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. చేసిన మొదటి సినిమా మంచి హిట్ కావడంతో ఆయనకు దర్శకుడిగా మరిన్ని అవకాశాలు దక్కాయి. సుదీర్ఘ దర్శక కెరియర్లో సుమారు 15 వరకు సినిమాలు చేసిన కొన్ని సినిమాలు మాత్రమే ఆయనకు దర్శకుడుగా మంచి పేరు తీసుకొచ్చాయి.
Hi Nanna: ‘నాన్న’కి హాయ్ చెప్పిన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఆయన చివరిగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే పాత్రలో నటించాడు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ విషయాలు మాత్రమే బయటికి తెలుసు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, మరొక కుమారుడు ఉన్నారు. తన భార్య పిల్లలతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కెమెరా కంటికి చిక్కారు. అప్పుడు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఇక ఈ ఫోటోలు వీడియోలలో చూస్తే రవిబాబు కుమార్తె హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు అనేంత అందంగా కనిపిస్తోంది. ఇక కుమారుడు కూడా పెద్దవాడిలాన్ని కనిపిస్తున్నాడు అయితే వారికి సినీ రంగం మీద ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ రవి బాబు కుటుంబం గురించి మాత్రం సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!