Tirumala : శ్రీవారి గర్భాలయం పేరు ‘ఆనంద నిలయం’ అని ఎందుకు పిలుస్తారొ తెలుసా? దీని వెనుక ఉన్న గూఢార్థం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బంగారు కాంతులతో మెరిసిపోయే శ్రీవారి గర్భాలయ గోపురం. దీనినే ‘ఆనంద నిలయం’ అని పిలుస్తారు. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? అక్కడ అడుగుపెట్టగానే భక్తులు ఎందుకు తన్మయత్వానికి లోనవుతారో తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే ఏ పూజలోనైనా, క్షేత్ర దర్శనంలోనైనా మన త్రికరణములు (మనస్సు, వాక్కు, కర్మ) ఒకేచోట లగ్నం కావు. గుడిలో ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది, మాటల్లో మరో విషయం ఉంటుంది. కానీ, తిరుమల ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే ఒక వింత మార్పు సంభవిస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనసులో గోవింద నామం, నోట గోవింద స్మరణ, చేసే ప్రతి చేష్ట ఆ దైవ చింతనలోనే లగ్నమవుతాయి.
చాలామంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నాక బయటకు వచ్చి.. “అయ్యో! స్వామిని ఏవేవో కోరుకుందాం అనుకున్నాను, తీరా ఆయన ముందు నిలబడగానే ఏమీ అడగకుండానే వచ్చేసాను” అని అంటుంటారు. దీనికి కారణం ఆనంద నిలయంలో లభించే ఆ పారవశ్యం. జీవాత్మ పరమాత్మను చూసినప్పుడు కలిగే ఆనందం ముందు మరే కోరికలూ నిలబడవు. అరగంట కూర్చున్నా, ఒక్క నిమిషం నిలబడినా మనసు శూన్యమై కేవలం భక్తితో నిండిపోతుంది. కలికాలంలో త్రికరణములను ఒకే దారిలో పెట్టి, జీవాత్మకు ఆ పరమాత్మ దర్శనంతో అసలైన శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే ప్రదేశం కాబట్టే, అది ‘ఆనంద నిలయం’ గా ప్రసిద్ధి చెందింది. ఆ శ్రీనివాసుడి దర్శనం కేవలం కంటికి మాత్రమే కాదు, అంతరాత్మకు కూడా పరమ ఆనందాన్ని ఇస్తుంది.
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!