Site icon NTV Telugu

Maharashtra: ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి

Adee

Adee

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు.

ఇది కూడా చదవండి: Snakes on a plane: వీడెవడండీ బాబు.. ఏకంగా అనకొండలను రవాణా చేస్తున్నాడు..

అథని తాలూకాలోని బల్లిగేరికి చెందిన ముగ్గురు మహిళలు మహారాష్ట్రలోని జట్టా సమీపంలో వారు ప్రయాణిస్తున్న క్రూజర్ బోల్తా పడింది. శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంతో విషాదకరంగా మారింది. మృతులు మహాదేవి చౌగల, గీతా దొడమణి, కస్తూరిగా గుర్తించారు. పనుల నిమిత్తం వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Capitals Captain: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌!

Exit mobile version