Tiragabadara Saami Teaser: బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసినా తప్పులేదు గిరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Tharun’s Tiragabadara Saami Movie Teaser Released: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నార్ చోప్రా నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘తిరగబడరా సామీ’. ఎఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఏ సినిమాను సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరగబడరా సామీ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ కాగా.. తాజాగా టీజర్ విడుదల అయింది.
1 నిమిషం 47 సెకండ్ల నిడివి గల ఈ సినిమా టీజర్.. ‘ఈ పనినే ప్రొఫెషన్‌గా ఎందుకు చూజ్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. ‘బాలయ్య సినిమా టికెట్స్ కోసం మర్డర్ చేసినా తప్పులేదు గిరి’, ‘ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయివనం అంటున్నారని ఓ తులసి మొక్కను నాటా’, ‘ప్రాణమంటే భయపడే పిరికోడితో నీకు కాపురం ఎందుకు చెప్పు.. నువ్ ఎల్లిపో’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: TTD Tigers: ఆపరేషన్ ‘చిరుత’ సక్సెస్.. ఇక కాలినడక భక్తులు ప్రశాతంగా వెళ్లొచ్చు!
ఆద్యంతం నవ్వుల ప్రయాణంలా సాగిపోయే కథ ఇదని, రాజ్ తరుణ్ పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుందని దర్శక నిర్మాతలు ఇదివరకే చెప్పారు. భయపడే ఓ యువకుడు తన సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంతో ఈ సినిమా కథ సాగుతుందని టీజర్‌లో అర్ధమైంది. ఈ సినిమాకి సంగీతం జెబి కాగా.. ఛాయాగ్రహణం ఎంఎన్ జవహర్ రెడ్డి. తిరగబడరా సామీ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ చెపుతామని టీజర్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!