NTV Telugu Site icon

Tips To Escape From drowning Car: మీరు ఉన్న కారు మునిగిపోయిందా? ఇలా తప్పించుకోండి

Car

Car

Tips To Escape From drowning Car:: వర్షాకాలం వచ్చేసింది. దేశంలో చాలా చోట్ల వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో వరద నీటిలో కార్లు కొట్టుకుపోవడం, నీటిలో మునిగిపోవడం చూశాం. ఆ సమయంలో మరొకరి సాయం లేకుండా బయటకు రావడం కష్టం. కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అటువంటి ప్రమాదాలు ఎదురైతే సులభంగా బయటపడవచ్చు. మీ కారు నీటిలో మునిపోవడం మీరు గమనిస్తే ముందు టెన్షన్ పడకండి. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని మీకు మీరే ధైర్యం చెప్పుకోవడం ముఖ్యం. ఈ సమయంలో ఒక్క నిమిషం లోపలే మీరు బయటపడాలి లేదంటే కారు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు బయటపడటం చాలా కష్టం. ఒక వేళ కారు నీటిలో మునిగిపోతే మీ సీట్ బెల్ట్ ను వెంటనే తీసేయండి. విండో తెరవండి. తెరుచుకోకపోతే పగలగొట్టండి. దీని కోసం మీ కారులో ఎల్లప్పుడూ ఒక సాధనాన్ని ఉంచుకోండి.

Also Read: Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్

కారులో పిల్లలు ఉంటే ముందుగా వారిని బయటకు పంపిచేయండి. ఆ సమయంలో మీ సీట్ బెల్ట్ ను తీసేయండి ఎందుకంటే సీట్ బెల్ట్ ఉంటే మీరు ఫ్రీగా కదలలేరు.  మీ విండో గేటు కంటే నీరు ఎక్కువ కాకముందే గేటు తెరవండి. కారు పూర్తిగా నీటితో నిండటానికి నిమిషం నుంచి 2 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయంలో మీరు డ్రిప్ బ్రీత్ తీసుకోండి ఎందుకంటే కారు మునిగిపోయిన  మీకు  కొద్దిసేపు గాలి సరిపోతుంది. తరువాత విండోస్ తెరవడానికి, డోర్ బద్దలు కొట్టడానికి ప్రయత్నించండి.  మీరే నడుపుతున్నట్లయితే.. ముందుగా మీరు రెండు చేతులను స్టీరింగ్ వీల్‌పై “10 మరియు 2” స్థానాల్లో ఉంచండి. ఎందుకంటే కారు నీటిలో పడిపోవడం వల్ల దానిలోని ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టీరింగ్‌ వీల్‌పై మీ పొజిషన్‌ను మార్చకుండా అలాగే కూర్చోవాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక నీరు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కారులో నుంచి బయటకు వచ్చి ఎటు ఈత కొట్టాలో తెలియకపోతే వెలుతురు కనిపిస్తున్న వైపు ఈత కొట్టండి. పైకి వెళుతున్నప్పుడు మీరు చూసే బుడగలను అనుసరిస్తూ వెళ్లండి. ఈత కొట్టేటప్పుడు మీకు బండరాళ్లు, పిల్లర్స్, ఇతర బరువైన వస్తువులు అడ్డురావచ్చు. వాటి వల్ల మీకు ప్రమాదం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు బయట పడగానే మీ సన్నిహితులకు సమాచారం అందించండి. అనంతరం ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది.