మానవ శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. ఇది జీవితాన్ని నిలబెట్టడానికి కీలకమైన వందలాది పనులను చేస్తుంది. కాలేయం గ్లైకోజెన్ నిల్వలు, శక్తి కోసం శరీరానికి అవసరమైన ఇంధనం. అంతేకాకుండా.. పిత్తాన్ని తయారు చేస్తుంది, ఇది కొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడానికి మరియు దెబ్బతిన్న కణజాలాలను సరిచేయడానికి సహాయపడే పదార్థాలను తయారు చేస్తుంది. రక్తం నుండి ఆల్కహాల్, టాక్సిన్స్ లేదా ఔషధాలను ప్రాసెస్ చేస్తుంది మరియు తొలగిస్తుంది. శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. కాలేయం చాలా కఠినమైనది. ఇది దెబ్బతిన్నప్పుడు కూడా పని చేస్తూనే ఉంటుంది. అది తీవ్రంగా దెబ్బతినే వరకు దానినే రిపేర్ చేయడం కొనసాగించవచ్చు. అయితే.. లివర్ సిర్రోసిస్ అనేది దీర్ఘకాలిక కాలేయ దెబ్బతినడం వల్ల కాలేయం మచ్చలు (ఫైబ్రోసిస్). మచ్చ కణజాలం కాలేయం సక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. సిర్రోసిస్‌ను కొన్నిసార్లు ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది హెపటైటిస్ వంటి కాలేయాన్ని ప్రభావితం చేసే పరిస్థితుల నుండి ఇతర దశల నష్టం తర్వాత జరుగుతుంది.
Also Read : CM YS Jagan: పెట్టుబడులతో రండీ.. ఏపీ మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైనది
ఓ వ్యక్తి సిర్రోసిస్ బారినపడినా కూడా ఆ వ్యక్తి కాలేయం పని చేస్తూనే ఉండవచ్చు. అయినప్పటికీ, సరైన చికిత్స తీసుకోకపోతే సిర్రోసిస్ చివరికి లివర్ ఫెల్యూర్‌కు దారితీస్తుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. చికిత్స సిర్రోసిస్ ఎండ్ స్టేజ్ వరకు రాకుండా ఆపగలదు. అయితే.. ఆయర్వేదం ద్వారా.. మీ లివర్‌ను సంరక్షించుకోవచ్చు. కలబం, ఉసిరి రసం.. సిర్రోసిస్ నుంచి కాలేయాన్ని కాపాడుతుంది. లివర్ సిర్రోసిస్‌తో బాధపడే వారు.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5-5 మిల్లీలీటర్ల కలబంద, ఉసిరి రసం తాగాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : K.Keshava Rao : ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపకపోతే ఎలా.?
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ (త్రిఫలాలు) చూర్ణానికి యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికం. అయితే.. ఈ వీటిలోన ఔషధ గుణాలు.. కాలేయానికి మేలు చేస్తాయి. రోజూ రాత్రి గోరువెచ్చని నీళ్లలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకుంటే.. కాలేయాన్ని సిర్రోసిస్ నుంచి రక్షించుకోవచ్చు. ఇదే కాకుండా.. అర్జున చెట్టు ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వే నిపుణులు అంటున్నారు. ఎన్నో ఏళ్లుగా అర్జున చెట్టు బెరడును అనేక అనారోగ్యాల చికిత్సలో వాడుతున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇది లివర్ సిర్రోసిస్ తీవ్రమైన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి.. అర గ్లాస్ అర్జున చెట్టు బెరడు టీ తాగితే.. లివర్ శక్తి పెరుగుతుంది.
లివర్‌ను కాపాడుకోవడానికి మరో ఔషదం తులసి. ఈ తులసి ఆకుల్లో హెపాటో ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి. లివర్ సిర్రోసిస్‌తో బాధపడే వారు తులసి ఆకు తిన్నా, తులసి టీ తాగినా మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.