NTV Telugu Site icon

Tips For Asthma In Winter : చలికాలంలో ఆస్తమాతో జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి..!

Asthama

Asthama

శీతాకాలంలో వణికించే చలిమూలంగా ఆస్తమా తీవ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. తరచూ ఎటాక్స్‌ వస్తూ ఉంటాయి. దీనితో ఆస్తమా బాధితులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. అయితే సీజన్‌ మార్పులకు వాతావరణానికి అనుగుణంగా జీవన శైలి, ఆహారం అలవాట్లు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తమాను అదుపులో ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. శీతాకాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : Adipurush release date: ఆదిపురుష్ న్యూ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చకు రెడీగా ఉండండి

చలికాలంలో ఆస్తమాను అత్యంత ప్రమాదకారిగా చెప్పుకోవచ్చు. చలికాలం మిగతా వారికి ఎలా ఉన్నా ఆస్తమా బాధితులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో బాక్టీరియా, వైరస్‌ తో నిండిన చలిగాలుల ధాటికి తరచూ ఆస్తమా బాగా తీవ్రం అవుతుంటుంది. ఆస్తామా బాధితుల్లో ఇప్పటికే కుంచించుకు పోయిన శ్వాస మార్గాలు చలికాలంలో చల్లదనం మూలంగా మరింతగా కుంచించుకు పోతాయి. దీంతో ఆస్తమ బాధితులు ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపల విలవిల్లాడాల్సి వస్తుంది.

 

చలికాలంలో ఆస్తమా బాధితులు జలుబు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఒకవేళ జలుబు చేసిన అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. రోజువారి ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి దినుసులను ఎక్కువగా తీసుకోవాలి. ఆస్తమా తీవ్రంగా ఉండి, ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నేటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటవెంటనే కాపడం పెట్టడం మంచిది.

యూకిలిప్టస్‌ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి నీటితో ఆవిరి పెట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా పెంచిన వాము చూర్ణాన్ని ఒక గ్లాస్‌ మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పలచబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రం అవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లం ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజు వారి ఆహార పదార్థాలలో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు రోజువారి ఆహారంలో జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. చల్లటి వాతావరణానికి చల్లటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. నిండుగా దుస్తులు ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు వంటివాటిని శుభ్రంగా ఉతికిన తర్వాత వేసుకోవాలి. రోజు కాసేపు నడవడం, ఈత కొట్టడం, యోగ, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఈ సీజన్‌లో ఆస్తమా బాధితులకు చాలా మంచివి.