Train Ticket Name Change: భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది వారి గమ్య స్థానాలను చేరుకోవడానికి ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణంలో ఎదురయ్యే అసౌకర్యాన్ని నివారించడానికి చాలామంది ప్రయాణికులు రైలులోని రిజర్వ్ చేసిన కోచ్‌లలో టిక్కెట్లను బుక్ చేసుకోని ప్రయాణం చేస్తారు. రైలులో రిజర్వేషన్‌ను బుక్ చేస్తున్నప్పుడు, చాలా సార్లు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో చూపించడం సహజమే. చాలామంది తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవడమే ఇందుకు గల కారణం. అయితే ఇలా చేయడం ద్వారా వారు కన్ఫర్మ్ సీటు పొందవచ్చు. కానీ, ప్రయాణానికి ముందు ప్రజల ప్రణాళికలు మారడం చాలాసార్లు మారుతుంటాయి. ఈ సందర్భాల్లో ప్రజలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో టిక్కెట్‌ను కూడా రద్దు చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని చార్జెస్ పోను దానిపై మీరు డబ్బును వాపసు పొందుతారు. కానీ, మీకు కావాలంటే మరొక పద్ధతిని కూడా ప్రయత్నించవచ్చు.
Also Read: PM Modi: ప్రధాని మోడీ భద్రతా వలయంలో మహిళా కమాండో.. నెట్టింట ఫోటోలు వైరల్
అదేంటంటే, మీరు మీ రైలు టికెట్ ను ఎవరికైనా బదిలీ చేయవచ్చు. అంటే మీరు మీ టిక్కెట్‌ను రద్దు చేయవలసిన అవసరం లేదు. మీరు బుక్ చేసుకున్న టిక్కెట్‌పై మరొకరు ప్రయాణించవచ్చు. అయితే, ఈ సదుపాయం రైల్వే కౌంటర్ నుండి టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి, అలాగే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రైల్వేలు అందించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని డబ్బులు ఆదా ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ టిక్కెట్ల బదిలీకి రైల్వేశాఖ కొన్ని నిబంధనలను కూడా విధించింది.
ఎవరైనా తమ టిక్కెట్‌ను బదిలీ చేయాలనుకుంటే.. వారు దానిని తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్యతో కూడిన కుటుంబ సభ్యులకు మాత్రమే బదిలీ చేయవచ్చు. టిక్కెట్టు వారికి మాత్రమే బదిలీ చేయబడుతుంది. వారు తప్ప మరెవరికి మార్చలేరు. అలాగే ఎవరైనా మహిళ రిజర్వేషన్ చేయించుకుంటే వారి టికెట్ కేవలం వారి సంబంధిత మహిళలకు మాత్రమే బదిలీ అవుతుంది. అయితే, టిక్కెట్‌ను బదిలీ చేయడానికి మీరు రైలు బయలుదేరే 24 గంటల ముందు రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్‌కు వెళ్లాలి. ఆ తర్వాత మీరు టికెట్ బుక్ చేయబడిన పేరు, దానిని బదిలీ చేయవలసిన పేరు అక్కడ వ్రాసిన దరఖాస్తును సమర్పించాలి. అయితే, ఆ సమయంలో ఇద్దరికీ గుర్తింపు కార్డులు అవసరం. మీరు ఈ పత్రాలన్నింటినీ రైల్వే అధికారాకి సమర్పించాలి. ఆ తర్వాత తదుపరి ప్రక్రియ పూర్తవుతుంది.