Site icon NTV Telugu

Time Magazine: టైమ్‌ మేగజీన్‌ 2024 లో ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..

1

1

తాజాగా వార్తాపత్రిక టైం మేగజీన్‌ 2024 కి సంబంధించి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఈ మేగజీన్‌ ప్రపంచవ్యాప్తంగా మనుషుల జీవితాలతో ఎవరైతే కీలకంగా ముడిపడి ఉంటారో.. అందులో ముఖ్యంగా మనుషులను ప్రభావితం చేసే వ్యక్తులను ఈ సంస్థ తన లిస్టులో చేరుస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టైమ్స్ మేగజీన్‌ తన వివరాలను వెల్లడించింది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు అన్న విషయానికి వస్తే..

Also read: Rishabh Pant: ఐపీఎల్‌లో రిషబ్ పంత్ అరుదైన ఘనత!

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌ ఇలా కొందరు భారతీయులు టైమ్‌ మేగజీన్‌ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో స్థాన్నాన్ని సంపాదించారు. ఇక వీరితో పాటు అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్‌, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించారు.

Also read: Off The Record: ఆ సీనియర్ ఐఏఎస్‌కు మళ్లీ షాక్ తగలబోతుందా..?

ఇక ఈ లిస్ట్ లోని పేర్లను ఉద్దేశించి టైమ్‌ మేగజీన్‌ సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ప్రపంచంలోని చాలామంది భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారని.. ఈ విషయం మానవాళికి మంచిదన్న విషయం కూడా’’ తెలుపుతూ.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌బంగా గురించి మాట్లాడుతూ.. ఓ కీలక సంస్థను పరివర్తనం చెందించే అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం సులభమేమీ కాదు అంటూ పేర్కొంది.

Exit mobile version