IND vs NZ: టిమ్ సౌథీ షాకింగ్ డెసిషన్.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే?
- సౌథీ షాకింగ్ డెసిషన్
- 14 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం
- మరోసారి టెస్టు కెప్టెన్‌గా లాథమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tim Southee Steps Down As New Zealand Test Captain: న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. కివీస్ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన వ్యక్తిగత ప్రదర్శనను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తానని చెప్పాడు. 2022లో కేన్ విలియమ్సన్ నుంచి జట్టు పగ్గాలను అందుకొన్న సౌథీ.. న్యూజిలాండ్ జట్టుకు 14 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. సౌథీ కెప్టెన్సీలో కివీస్ 6 మ్యాచ్‌లు గెలవగా.. 6 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక టామ్ లాథమ్ మరోసారి టెస్టు కెప్టెన్ పగ్గాలు అందుకోనున్నాడు.
Also Read: Rohit Sharma: 100కు ఆలౌట్ అయినా పర్లేదనుకున్నాం: రోహిత్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
తనకు కెప్టెన్సీ అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్ మేనేజ్మెంట్కు టిమ్ సౌథీ ధన్యవాదాలు తెలిపాడు. ‘న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు. జట్టు విజయం కోసం చాలా కృషి చేశా. జట్టే నా తొలి ప్రాధాన్యతగా భావించా. ఇక నుంచి నా వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టిసారిస్తా. కివీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. సహచరులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. యువ బౌలర్లను ఎప్పటిలానే ప్రోత్సహిస్తాను. టామ్ లాథమ్‌కు ఆల్ ది బెస్ట్. అతడు విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని 35 ఏళ్ల సౌథీ పేర్కొన్నాడు. అక్టోబర్ 16 నుంచి భారత్‌తో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు లాథమ్ నాయకత్వం వహిస్తాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!