Tilak Varma: షాకింగ్ గణాంకాలు.. ఆసియా కప్ హీరో తెలుగు తేజం తిక్‌వర్మ.. టీ20 వరల్డ్ కప్‌లో టెంపో తగ్గిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tilak Varma: తెలుగు తేజం తిలక్ వర్మ ఆసియా కప్‌లో ఎలా అదరగొట్టాడో అందరికీ తెలిసిందే. కానీ.. తాజాగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో తిలక్ పర్ఫామెన్స్ కొంత గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి.. టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టుకు మధ్య ఓవర్ల టెంపో చాలా అవసరం. ఇక్కడే తిలక్‌కు నెగిటివ్ గణాంకాలు వెలువడుతున్నాయి. నంబర్ 3గా వచ్చే బ్యాటర్ స్ట్రైక్ రేట్ 115–125 మధ్య ఉండిపోతే.. చివర్లో వచ్చే బ్యాటర్లకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్నిసార్లు కెప్టెన్‌కే ఫైర్‌మ్యాన్‌లా ఆడాల్సిన పరిస్థితి వస్తోంది.
READ MORE: Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
వాస్తవానికీ 2025 సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ 69 (53) ఆడి చేజ్‌ను నిలబెట్టాడు. ఆ ఇన్నింగ్స్ ట్రోఫీ తెచ్చింది.. అదే సమయంలో స్పీడ్‌గా రన్స్ చేయగల బ్యాటర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తిలక్ బ్యాటింగ్‌లో రెండు రూపాలు కనిపించాయి. దక్షిణాఫ్రికాపై 62 (34), 73 (42) లాంటి ఇన్నింగ్స్ చూస్తే ఇంకా మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చగలడని తేలింది. అంటే దూకుడు తగ్గలేదని స్పష్టమైంది. కానీ వరల్డ్‌కప్‌లో మాత్రం గణాంకాలు వేరేలా కనిపిస్తున్నాయి. నాలుగు ఇన్నింగ్స్‌లో 106 రన్స్, స్ట్రైక్ రేట్ 120.45కి పడిపోయింది. మ్యాచుల్లో వరుసగా 25, 25, 25, 31 రన్స్ మాత్రమే చేశాడు. ప్రతి మ్యాచ్‌లో స్టార్ట్ ఉంది కానీ పెద్ద స్కోర్‌గా మారలేదు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో భారత్ 193 చేసినా.. తిలక్ 31 (27) మాత్రమే స్కోర్ చేశాడు. ఏది ఏమైనప్పటికీ టీ20 ఫార్మాట్ కఠినమైనది. నంబర్ 3 బ్యాటర్ స్టార్ట్ తీసుకుని పెద్ద స్కోర్ చేయకపోతే మిగతా బ్యాటింగ్‌పై ఒత్తిడి పడుతుంది. అందుకే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. సూర్యకుమార్‌ను తిలక్ కంటే ముందు పంపాలా? అనే వాదన కొనసాగుతోంది. తిలక్‌ను 4 లేదా 5లో ఫ్లోటర్‌గా ఉపయోగించాలా? సూపర్ 8 ముందు ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది. తిలక్ వేగంగా ఆడటం మర్చిపోలేదు. భారత్ అతనిని నంబర్ 3లో కొనసాగిస్తే స్పష్టమైన ప్లాన్ అవసరం. 15 బంతులు ఆడేసరికి స్ట్రైక్ రేట్ పెరగాలి. 7–15 ఓవర్ల మధ్య బౌండరీలు రావాలి. అలా జరిగితే ఈ చర్చ ఒక్కసారిగా ఆగిపోతుంది. లేకపోతే “స్కైను ముందుకు పంపాలి” అనే వాదన పెరుగుతుంది.
READ MORE: Babar Azam: ఒకప్పుడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. నేడు దిక్కుతోచని స్థితిలో బాబర్ ఆజామ్..
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!