IND Player Tilak Varma Hits Consecutive Sixes Off Joseph On T20I Debut vs WI: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినా.. తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకు కారణం తిలక్ వర్మ అంతర్జాతీయ అరంగేట్రం. మొహ్మద్ సిరాజ్ అనంతరం భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్లేయర్ తిలక్. హైదరాబాదీ కుర్రాడు తిలక్ అరంగేట్రం చేయడమే కాదు.. అదరగొట్టాడు కూడా. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లో 2 సిక్స్‌లు బాది అంతర్జాతీయ క్రికెట్‌లో తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మలో కొంచెం కూడా భయం కనిపించలేదు. క్రీజులోకి రావడమే ఆలస్యం బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. ఐపీఎల్ అనుభవం అంతర్జాతీయ క్రికెట్‌కు బాగా ఉపయోగపడిందనడానికి ఇదే ఓ నిదర్శనం. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. అల్జారీ జోసెఫ్ వేసిన 6వ ఓవర్లోని మూడో బంతిని 81 మీటర్ల సిక్స్ బాదాడు. ఆ తర్వాతి బంతిని కూడా భారీ సిక్సర్ కొట్టాడు. దాంతో విండీస్ పేసర్ జోసెఫ్ షాక్ అయ్యాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ.. 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు బాదాడు. భారత ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ కుర్రాడు తిలక్‌దే అత్యధిక స్కోర్ కావడం విశేషం. తిలక్ బాదిన రెండు వరుస సిక్సర్‌లకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘గొప్ప అరంగేట్రం’, ‘సూపర్బ్ ఇన్నింగ్స్’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆలస్యం ఎందుకు వీడియోను మీరు చూసేయండి. తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
Also Read: Hardik Pandya: తప్పులు చేశాం.. మూల్యం చెల్లించుకున్నాం: హార్దిక్ పాండ్యా
Tilak Verma start his International Cricket career with two Incredible Sixes – 6,6.
What a start to his career – The future Star of Indian cricket..!!pic.twitter.com/P88QGWHUAl
— CricketMAN2 (@ImTanujSingh) August 3, 2023