NTV Telugu Site icon

Tilak Varma: తెలుగోడి దెబ్బ.. రికార్డులు అబ్బా

Tilak Varma

Tilak Varma

Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా పర్యటనలో తిలక్ చివరిసారిగా ఔటవగా.. ఆ తర్వాత రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో తన అద్భుత బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 166 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తిలక్ 72* పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోగా, తిలక్ వర్మ ఆదిన ఇన్నింగ్స్ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్ లో సరికొత్త షాట్లతో తిలక్ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో భారత జట్టు టీ20 సిరీస్‌లో 2-0 తో ముందంజలో ఉంది.

Also Read: Toxic: ‘టాక్సిక్’ సినిమాలో యష్‌కి జోడీగా ఆ స్టార్ హీరోయిన్..?

టీ20లో రెండుసార్లు ఔటైన తర్వాత మధ్య అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్స్ వివరాలు చూస్తే..

* 318* తిలక్ వర్మ (107*, 120*, 19*, 72*)

* 271 మార్క్ చాప్‌మన్ (65*, 16*, 71*, 104*, 15)

* 240 ఆరోన్ ఫించ్ (68*, 172)

* 240 శ్రేయాస్ అయ్యర్ (57*, 74*, 73*, 36)

* 239 డేవిడ్ వార్నర్ (100*, 60*, 57*, 2*, 20) లు వరుసగా ఉన్నారు.

Also Read: Kishan Reddy: తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పద్మ అవార్డులు.. కేంద్రమంత్రి అభినందనలు

ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు మరోసారి ఆరంభం అంతగా లభించలేదు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (4), బెన్ డకెట్ (3) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. గత మ్యాచ్ లానే ఈసారి కూడా కెప్టెన్ జోస్ బట్లర్ జట్టు ట్రబుల్ షూటర్ గా మారాడు. 45 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. చివరగా బ్రైడెన్ కార్స్ 17 బంతుల్లో 31 పరుగులు చేసి జట్టు స్కోరు 165కు చేర్చాడు. 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన టీమిండియాకు కూడా మంచి శుభారంభం లభించలేదు. గత మ్యాచ్‌లో హీరో అభిషేక్ శర్మ 12 పరుగుల వద్ద అవుట్ కాగా, సంజూ శాంసన్ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు. మూడో స్థానంలో వచ్చిన తిలక్ వర్మకు మిడిలార్డర్‌లో ఎవరి మద్దతు లభించలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. తిలక్ వర్మ చివరకు వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌ లతో చిన్న భాగస్వామ్యాలు చేసి చివరి ఓవర్‌లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరిలో రవి బిష్ణోయ్‌ కొట్టిన రెండు ఫోర్లు జట్టు విజయానికి ఎంతో దోహదపడ్డాయి. మొత్తానికి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.