Site icon NTV Telugu

Tiger vs Bear: ఎలుగుబంటి దెబ్బకు పరుగుపెట్టిన పెద్దపులి.. వీడియో వైరల్..

Capture

Capture

ప్రస్తుతం అంతర్జాలం అందరికీ అందుబాటులో ఉండడం కారణంగా.. ప్రపంచం మొత్తంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది. ఇందులో ముఖ్యంగా ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపచేసేలా ఉంటాయి. మరికొన్ని భయభ్రాంతులకు లోనయ్యే విధంగా కూడా ఉంటాయి. ఇకపోతే తాజాగా ఎలుగుబంటి, పెద్దపులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన విశేషాలు చూస్తే..

Also Read: Mansoor Ali Khan: నాకు పండ్ల రసంలో విషం కలిపి ఇచ్చారు.. మన్సూర్‌ అలీ ఖాన్‌ సంచలన ఆరోపణలు!

మామూలుగా ఎక్కడైనా సరే అడవిలో జంతువులు పెద్దపులిని చూస్తే.. దాని దరిదాపుల్లో ఉండకుండా వెళ్ళిపోతాయి. అయితే ఒక ఎలుగుబంటి తప్ప. నిజానికి ఎలుగుబంటికి కోపం వస్తే ఎంతటి జంతువు అయినా సరే.. పక్కకి వెళ్లిపోవాల్సిందే. తాజాగా ఇలాంటి సంఘటన మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో చోటుచేసుకుంది. ఉన్నటువంటి ఓ ఎలుగుబంటి కి కోపం రావడంతో పెద్దపులిను సైతం పరుగులు పెట్టించింది.

Also Read: Tesla: టెస్లాకి అంత ఈజీ కాదు.. టాటా, మహీంద్రాలను తట్టుకుంటుందా..?

రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ కల్వర్టు పక్కన ఎండిన నీటిగుంటలో ఉన్న ఎలుగుబంటి వైపు వెళ్ళింది ఓ పెద్దపులి. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. సడన్ గా లేచి పెద్దపులి వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఎదురుగా నిలబడి పెద్దపల్లి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. దాంతో దెబ్బకి ఒక్కొక అడుగు వెనక్కి వేసుకుంటూ పరుగులు పెట్టింది. ఈ సంఘటనకు సంబంధించి అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ చూడడానికి వెళ్ళిన పర్యాటకులు వారి కెమెరాలు బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Exit mobile version