Site icon NTV Telugu

Tiger: భూపాలపల్లి జిల్లాలో మళ్ళీ పెద్దిపులి సంచారం.. ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళిన వైనం

Tiger

Tiger

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చిట్యాల మండలం జడల పేట గ్రామ శివారులో ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులి సంచారంతో జడల్ పేట గాంధీనగర్ భీష్మ నగర్ రామచంద్రపూర్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచారం పైనా అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎద్దు మరణానికి పెద్ద పులి దాడే కారణమా అని సమాచారాన్ని సేకరిస్తున్నారు అటవీశాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు పరిశీలించారు.

Exit mobile version