Tiger Nageswara Rao : రవితేజ సినిమాకు భారీ స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇప్పటికే దసరా సందర్బంగా బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ లియో సినిమా లు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్నాయి. దీనితో వీరిద్దరికీ పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు.అయితే ఆ రెండు సినిమాలు రవితేజ సినిమా కంటే ముందు రోజు అనగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి….ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది. టైగర్ నాగేశ్వరరావుతో పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు రవితేజ. 1980 దశకంలో తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఫిక్షనల్ బయోపిక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నుపుర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ రవితేజ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్ వంటి వారు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..
అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 38 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి 18 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా…నైజాంలో తొమ్మిది కోట్లు వరకు టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే ఓవర్‌సీస్‌లో మూడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో టైగర్ నాగేశ్వరరావు విడుదల కాబోతోంది. రవితేజ గత సినిమాలకు రెట్టింపు బిజినెస్‌ను ఈ సినిమా చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. రావణాసుర 22 కోట్లు మరియు ధమాకా 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమా రికార్డులను టైగర్ నాగేశ్వరరావు క్రాస్ చేసింది.రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా టైగర్ నాగేశ్వరరావు నిలిచింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలిరోజు ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.
Also Read
- 200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!