Site icon NTV Telugu

Tiger: కాగజ్‌నగర్‌లో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

Tiger

Tiger

కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి జాడలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అంకుశాపూర్ వాంకిడి వైపు వెళ్లే దారిలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకల నిషేధం విధించారు. ఆ ప్రాంతంలో వన్య ప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా ఉండడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంకుశాపూర్ వాంకిడి రహదారి వైపు వన్య ప్రాణుల కదలికలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ముందస్తుగా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎండాకాలంలో ఎక్కువగా రహదారి వైపు పులులు లేదా ఇతర అటవీ జంతువులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులను ఫారెస్ట్ సిబ్బంది అలెర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌ని భయపెడుతున్న భారీ వర్షాలు.. 41 మంది మృతి..

పులి సంచారం వార్తలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు వేసవి కాలంలో ప్రజలు ఆరుబయట నిద్రిస్తుంటారు. ఈ నేపథ్యంలో బయట నిద్రపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Balakrishna: జగన్ మాటల మాంత్రికుడు..

Exit mobile version