NTV Telugu Site icon

Tiger Attack: ఆవుపై దాడి చేసింది చిరుత కాదు హైనా.. తేల్చేసిన అటవీశాఖ అధికారులు

Ranga Reddy

Ranga Reddy

Tiger Attack: రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామ శివార్లలో చిరుత సంచారం భయాందోళకు గురిచేసింది. ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు. కొత్తూరు గ్రామం శివార్లలోని పెంజర్ల రోడ్లో చిరుత సంచరించి ఆవు, గెదలపై దాడి చేస్తుందంటూ గ్రామస్తుల అందోళన చెందారు. కొందరు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులి సంచరించిన చోటు, ఆవు, గేదెపై దాడి చేసిన స్థలాలను అమనగల్ రేంజ్ అటవీశాఖ అధికారులు పరిశీలించారు.

Read also: Sreeleela : వామ్మో.. శ్రీలీలలో ఈ టాలెంట్ కూడా ఉందా?

ఆవుపై దాడి చేసింది చిరుత కాదని హైనాగా అటవీశాఖ అధికారి రవీందర్ తేల్చారు. సంఘటనా స్థలంలో ఎక్కడ చిరుత అనవాలు లేవని స్పష్టం చేశారు. ఆవుపై దాడి చేసింది హైనానే అని అటవీ శాఖ అధికారి రవీందర్ చెప్పాడు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుత సంచరించిన విషయం వాస్తవమే కాని చిరుతను బంధించామని క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా బయపడవద్దని రవీందర్ తెలిపారు. హైనాను త్వరలో బోన్ ఏర్పాటు చేసి బందిస్తామని తెలిపారు. ప్రజలకు చిరుత ఉందని భయం వీడాలని.. హైనా గ్రామంలో తిరుగుతుందని ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట బయటకు రావద్దని, పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు. త్వరలోనే హైనా ను పట్టుకుంటామని తెలిపారు.

Read also: Chandrababu Naidu: చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు!

మరోవైపు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరాం హడలెత్తిస్తోంది. దాడిలో రెండు ఆవులు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మేకలు,ఆవులు కాసే వారిని అడవిలోకి వెళ్లకూడదని అధికారులు గ్రామస్థులను హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని బయట తిరిగే టప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలోనే పులిపట్టుకుంటామని తెలిపారు.
Uttarpradesh : సీఎం యోగి కఠిన వైఖరి..యూపీలో అల్లర్లకు ఫుల్ స్టాప్