Site icon NTV Telugu

Tiger Attack: యువకుడిపై పెద్దపులి దాడి.. గట్టిగా కేకలు వేయడంతో.. !

Tiger Attack

Tiger Attack

Chenchu Youth Tiger Attack in Atmakur Forest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవి రేంజ్ పరిధిలో చెంచు యువకుడుపై పెద్దపులి దాడి చేసింది. జనాలు కేకలు వేయడంతో పెద్దపులి యువకుడుని వదిలి అడవిలోకి పారిపోయింది. యువకుడిని మెరుగైన వైద్య సేవల కోసం అటవీశాఖ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెద్దపులి రాకతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సదరం పెంట చెంచు గూడెంకి చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు సోమవారం రాత్రి బహిర్బుమికి బయటికి వెళ్లాడు. గూడెం శివారులో పొదల్లో దాక్కొని ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అంకన్నపై దాడి చేసింది. వెంటనే ఆ యువకుడు గట్టిగా కేకలు వేయడంతో గూడెం వాసులు పరుగెత్తుకెళ్లారు. గూడెం వాసులు గట్టిగా కేకలు వేసుకుంటూ అంకన్న వద్దకు చేరుకున్నారు. జనాల అరుపులు విన్న పెద్దపులి భయపడిపోయి అంకన్నను వదిలేసి అడవిలోకి పారిపోయింది. పులి దాడిలో యువకుడి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read: Jakkampudi Raja: జక్కంపూడి రాజా దీక్ష భగ్నం.. 50 మంది హౌస్‌ అరెస్ట్‌!

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అంకన్నను మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అంకన్న ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అంకన్నపై పెద్దపులి దాడి చేయడంతో స్థానిక గ్రామాల గిరిజనులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. రక్తం రుచి చూసిన పెద్దపులి మరలా వస్తుందని, దానిని పట్టుకోవాలని గిరిజనులు అటవీ శాఖ అధికారులను కోరారు. రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని గిరిజనులకు అధికారులు సూచించారు.

Exit mobile version