NTV Telugu Site icon

Odisha: పోలీసులు తీవ్రంగా వేధించారు.. అమ్మాయని చూడకుండా..!

Odisha

Odisha

పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్‌ 15వ తేదీ రాత్రి రెస్టారెంట్‌ను మూసివేసి ఇంటికి వెళ్తుండగా.. కొందరు వ్యక్తులు ఆమెను అడ్డుకుని దాడికి యత్నించారని తెలిపింది. దీంతో వారి నుంచి తప్పించుకుని భరత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. అక్కడ ఒక మహిళా పోలీసు మాత్రమే ఉంది. అయితే.. తన వెంట కొందరు వ్యక్తులు పడుతున్నారని.. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ తెలిపింది. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులను పంపాలని మహిళ పోలీసుతో బాధిత మహిళ చెప్పింది. ఈ క్రమంలో.. న్యాయం చేయాల్సింది పోయి, మహిళా పోలీసు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాకుండా.. దుర్భాషలాడింది.

Read Also: Jammu Kashmir: బీఎస్‌ఎఫ్ బస్సు కాలువలో పడి ముగ్గురు జవాన్లు మృతి..

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు బాధితురాలికి మరో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆమెను జైల్లో పెట్టి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. ఆ సమయంలో ఇద్దరు మహిళా పోలీసులు తన జట్టు పట్టుకుని కొట్టారని బాధిత మహిళ తెలిపింది. ఒక మహిళా పోలీసు తన గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిందని.. తనను తాను రక్షించుకోవడానికి ఆమె చేతిని కొరికినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. మహిళా పోలీసులు తన చేతులను జాకెట్‌‌తో వెనుకకు కట్టేసి, కాళ్లకు దుపట్టాతో బంధించి గదిలో బంధించారని చెప్పింది. కొంత సమయం తరువాత.. ఒక మగ పోలీసు తనపై ఉన్న బట్టలు తీసివేసి, ఛాతీపై చాలాసార్లు తన్నాడని తెలిపింది. కొన్ని గంటల తర్వాత ఒక సీనియర్ అధికారి వచ్చి తన ప్యాంటు కిందకు లాగి అత్యాచారం చేస్తానని బెదిరించాడని బాధిత మహిళ వెల్లడించింది.

Read Also: Pune: చూస్తుండగానే రోడ్డు మధ్యలో దిగిపోయిన డ్రైనేజీ ట్యాంకర్.. వీడియో వైరల్

Show comments