NTV Telugu Site icon

TDP-JSP : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్

Tdp Janasena

Tdp Janasena

ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్ జరుగుతోంది. పవన్ పర్యటన తర్వాత జిల్లాలో టీడీపీ – జనసేన నేతల మధ్య టికెట్ ఫైట్ పెరిగింది. రేపు జనసేన లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరనున్నారు. అయితే.. కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే… నర్సాపురంలో ఇప్పటికే జనసేన ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు ఇన్చార్జ్ పుత్తూరు రామరాజు మధ్య పోటీ నెలకొంది.

Also Read : Medaram Jatara: మేడారం జాతరకు సీఎం రేవంత్, గవర్నర్ తమిళసై.. ఏ రోజంటే..?

సుబ్బారాయుడు రాకతో మరింత గందరగోళంగా టిడిపి జనసేన రాజకీయం మారనుంది. తాడేపల్లిగూడెంలోని టీడీపీ జనసేన నాయకులు మధ్య టికెట్ వార్ నడుస్తోంది. వలవల బాబ్జి టీడీపీ టికెట్ ఆశిస్తుండగా.. జనసేన నుంచి పోటీకి సిద్ధమంటున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. వీటితో పాటు తణుకు, ఉంగుటూరు అసెంబ్లీలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, జనసేన ఇన్చార్జి విడివాడ రామచంద్రపురం మధ్య టికెట్ ముచ్చట ముదురుతోంది. ఉంగుటూరు అసెంబ్లీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జనసేన ఇన్చార్జ్ ధర్మరాజులు కూడా టిక్కెట్‌ తనకంటే తనకు అంటూ పోటీ పడుతున్నారు. అవకాశం మాదంటే మాదంటూ ప్రచారం చేసుకుంటున్నారు నాయకులు. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ-జనసేన కూటమి సమన్వయ సమావేశం నిర్వహించనుంది.

Gold Mine Collapses : వెనిజులాలో కూలిన బంగారు గని.. ప్రాణాలు పొగొట్టుకున్న డజన్ల కొద్ది ప్రజలు