భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లి తన నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించి.. మలేషియా టూర్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు. ఏడాదికి లక్ష ఎకరాల లక్ష్యం ఉంది కాని ముందుకు వెళ్లడం లేదని, రాష్ట్రంలో 80 శాతం చిన్న సన్నకారు రైతులున్నారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పామాయిల్ సాగులో అంతర పంటలకు సైతం సబ్సిడీ ఇస్తామని, మలేషియా లో అంతర పంటలు లేవని, గుట్టల పైనే సాగు చేస్తున్నారన్నారు. పొట్టి విత్తనం, మిషన్ లు పరిశీలన కు వెళ్లామని, ఫైబర్ గెడలు సౌకర్యంగా ఉన్నాయన్నారు. సబ్సిడీ తో గెడలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, మనకంటే మెరుగైన పద్ధతులు అన్వేషించాం కానీ ఆశించినంతగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. పామాయిల్ వ్యర్ధాలతో వస్తువుల తయారీ యూనిట్ లు పెట్టుకోమని మలేషియా వారిని ఆడిగామని, 70 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే దిగుమతి అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల.
Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!
అంతేకాకుండా..’పామాయిల్ మధ్యలో ములగా అంతర పంట గా వేయాలి. కొబ్బరి లో కూడా అంతర పంటలకు అనుకూలమే. వక్క సాగు లాభదాయకంగా ఉంటుందేమో పరిశీలిస్తున్నాం. అధికారుల బృందాలను కర్ణాటక పంపి వక్క పై పరిశీలన చేస్తాం. రైతుకు ఉన్న శాపాలు ఎవరికి ఉండవు. నష్టం రాని పంట వెయ్యాలి. పామాయిల్ వల్ల ఈ పదేళ్లలో రైతులు స్థిరపడ్డారు. వక్క, పామాయిల్, కోకో, మిరియం, జాజి. పంటలపై దృష్టి పెడదాం. పామాయిల్ కు 20 వేలు కనీస ధర ఇచ్చేలా డిమాండ్ చేస్తున్నా. లక్ష కోట్లు బయటకి ఇచ్చే బదులు వడ్డీ ఖర్చుతో లక్షల ఎకరాలు సాగు చేయవచ్చు.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
Nadendla Manohar: రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతాం..