Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే సినిమా రిలీజ్ కాదు: కర్ణాటక ఫిలిం ఛాంబర్..
- కమల్ హాసన్ క్షమాపణ కోరకుంటే థగ్ లైఫ్ రిలీజ్ అవ్వదు..
- అల్టిమేటం జారీ చేసిన కర్ణాటక ఫిలిం ఛాంబర్..
- ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thug Life: కమల్ హాసన్ తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కామెంట్స్ చేయడం వివాదానికి కారణమైంది. కర్ణాటకలోని ప్రజలు, పలు సంఘాలు కమల్ హాసన్ తీరును తప్పుపట్టాయి. ఆయన సినిమా విడుదలకు అనుమతించబోమని హెచ్చరించాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే, ఆయన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదలకు అనుమతించబోమని కర్ణాటక ఫిలిం బాడీ హెచ్చరించింది.
“ఆయన క్షమాపణ చెప్పకపోతే, థగ్ లైఫ్ కర్ణాటకను నడవదు. ఇది ఇండస్ట్రీ గురించి కాదు, ఇది రాష్ట్రం గురించి. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, కన్నడ అనుకూల సంస్థలు ఆయన స్పందించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. ఆయన క్షమాపణ లేకుండా సినిమా విడుదల కష్టం. మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కమల్ హాసన్ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు. ఈ సినిమా ఇక్కడ ఎలా విడుదల అవుతుంది?” కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహలు అన్నారు.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
Read Also: Operation Sindoor: భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి.. చైనా ఆందోళన..
కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర వివాదంగా మారాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలు కూడా కమల్ హాసన్ తీరును తప్పుపడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని, అది కమల్ హాసన్‌కి తెలియదని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బీవై విజయేంద్ర క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, తనకు క్షమాపణ చెప్పే ఆలోచన లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకుంటేనే క్షమాపణలు చెబుతానని చెప్పారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయంపై నమ్మకం ఉంచుతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజం. ప్రత్యేక ఎజెండా ఉన్నవారు తప్ప ఎవరూ దీనిని అనుమానించరు. నన్ను ఇంతకు ముందు కూడా బెదిరించారు, నేను తప్పు చేస్తే, నేను క్షమాపణ చెబుతాను, లేకపోతే చెప్పను’’ అని కమల్ హాసన్ అన్నారు.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!