Site icon NTV Telugu

Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుంటే సినిమా రిలీజ్ కాదు: కర్ణాటక ఫిలిం ఛాంబర్..

Kamal Haasan Kannada Language Controversy

Kamal Haasan Kannada Language Controversy

Thug Life: కమల్ హాసన్ తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘‘ కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని కామెంట్స్ చేయడం వివాదానికి కారణమైంది. కర్ణాటకలోని ప్రజలు, పలు సంఘాలు కమల్ హాసన్ తీరును తప్పుపట్టాయి. ఆయన సినిమా విడుదలకు అనుమతించబోమని హెచ్చరించాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే, ఆయన సినిమా థగ్ లైఫ్‌ని రాష్ట్రంలో విడుదలకు అనుమతించబోమని కర్ణాటక ఫిలిం బాడీ హెచ్చరించింది.

“ఆయన క్షమాపణ చెప్పకపోతే, థగ్ లైఫ్ కర్ణాటకను నడవదు. ఇది ఇండస్ట్రీ గురించి కాదు, ఇది రాష్ట్రం గురించి. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, కన్నడ అనుకూల సంస్థలు ఆయన స్పందించాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. ఆయన క్షమాపణ లేకుండా సినిమా విడుదల కష్టం. మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కమల్ హాసన్ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు. ఈ సినిమా ఇక్కడ ఎలా విడుదల అవుతుంది?” కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎం. నరసింహలు అన్నారు.

Read Also: Operation Sindoor: భారత్ సేకరించిన “చైనీస్ ఆయుధ శిథిలాల”పై ప్రపంచం ఆసక్తి.. చైనా ఆందోళన..

కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర వివాదంగా మారాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతలు కూడా కమల్ హాసన్ తీరును తప్పుపడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని, అది కమల్ హాసన్‌కి తెలియదని అన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ బీవై విజయేంద్ర క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, తనకు క్షమాపణ చెప్పే ఆలోచన లేదని కమల్ హాసన్ స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని అనుకుంటేనే క్షమాపణలు చెబుతానని చెప్పారు. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను చట్టం, న్యాయంపై నమ్మకం ఉంచుతాను. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ పట్ల నాకున్న ప్రేమ నిజం. ప్రత్యేక ఎజెండా ఉన్నవారు తప్ప ఎవరూ దీనిని అనుమానించరు. నన్ను ఇంతకు ముందు కూడా బెదిరించారు, నేను తప్పు చేస్తే, నేను క్షమాపణ చెబుతాను, లేకపోతే చెప్పను’’ అని కమల్ హాసన్ అన్నారు.

Exit mobile version