Site icon NTV Telugu

Osey Arundhathi: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ‘ఒసేయ్ అరుంధతి’..!

Osey

Osey

విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. వెన్నెల కిషోర్ , కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ ఇల్లాలు అరుంధతి.. తన పిల్లాడితో పాటు., తన ఇంటి బాధ్యతలను కూడా చూసుకుంటూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని భావిస్తుంది. కాకపోతే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య ఎదురైతుంది. ఆ సమస్య నుంచి తనని తాను ఎలా కాపాడుకుంటూ.. ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ఈ ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా అని చెప్పుకొచ్చాడు.

Also read: PM Modi: హెడ్‌లైన్స్‌ కోసం కాదు.. డెడ్‌లైన్‌ల కోసం పని చేస్తున్నా..

ఇక ఈ సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు.. ప్రధానంగా కామెడీ సాగే చిత్రమని తెలిపారు. ఈ చిత్రం పూర్తిగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని., ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సినిమాలో చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు నటిస్తున్నారు.

Also read: Aarambham Naga shivani: ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’ నుంచి హీరోయిన్ శివాని నాగరం పాడిన లిరికల్ సాంగ్ రిలీజ్..!

ఇక ఈ చిత్ర బృందం చూసినట్లయితే.. విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.., గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా సినిమాటోగ్రఫీగా సాయి చైతన్య మాటేటి, సంగీతాన్ని సునీల్ కశ్యప్, ఎడిటర్ గా మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ గా ఎన్.మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ గా వాసు వ్యవహరిస్తున్నారు.

Exit mobile version