NTV Telugu Site icon

Snake : పామును కసకస కొరికి చంపిన మూడేళ్ల చిన్నారి

Snake

Snake

Snake : సాధారణంగా పామంటే అందరికీ భయం.. దాన్ని చూడగానే చాలామంది ఆమడదూరం పరిగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి పామును కొరికి చంపేశాడు. అతడి వయసు మూడేళ్లుంటాయి. ఇంటి బయట ఆడుకుంటుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము దగ్గరికి వచ్చింది. అయితే ఆ బాలుడికి అది పాము అని తెలియదో లేకపోతే.. ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పామును పట్టుకుని కసకస కొరికేశాడు. దీంతో ఆ పాము చచ్చిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొత్వాలీ మహమ్మదాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని మద్రాపూర్ గ్రామంలో దినేష్ సింగ్ తన కొడుకు, తల్లితో కలిసి జీవిస్తు్న్నాడు. శనివారం నాడు ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు.

Read Also:Adipurush: రికార్డులు ఉంటే రాసి పెట్టుకోండి… 24 గంటల్లో అన్నీ లేస్తాయ్…

ఆ సమయంలోనే అక్కడికి ఓ పాము వచ్చింది. అది బాలుడి కంటపడింది. అయితే ..దాన్ని చూసి ఎలాంటి భయం లేకుండా దాని దగ్గరకు వెళ్లాడు. ఆ పామును తన చేతితో పట్టుకొని.. నోటితో కొరికి చంపాడు. అది చూసిన మిగతావారు.. భయంతో పరుగులు పెట్టారు. విషయం బాలుడి కుటుంబసభ్యులకు తెలిపారు. వారు వచ్చేసరికి.. పాము చచ్చిపోయింది కానీ బాలుడికి ఆరోగ్యం దెబ్బతిన్నది. కాసేపటికి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. బాలుడుతో పాటు.. చనిపోయిన పామును కూడా తీసుకొని స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాలుడుని గమనించిన వైద్యులు వెంటనే మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు విషయం తెలిసిన గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతకు ముందు ఎప్పుడూ తన మనవడు.. ఇలా విచిత్రంగా ప్రవర్తించలేదని… పామును అలా చేయడం విచిత్రంగా అనిపిస్తుందని.. ఆ బాలుడి నాయనమ్మ చెప్పింది.

Read Also:Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సామాన్లు బయట పడేసిన సిబ్బంది