NTV Telugu Site icon

Tragic Incident: ఇంటిపై ఉన్న బండరాయిని కదిలించిన కోతులు.. మూడేళ్ల చిన్నారి మృతి

Monkeys

Monkeys

monkeys send boulder rolling down from roof: ఇంటి పైకప్పుపై వేసిన బండరాయి బోల్తా పడి తలపై పడడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అక్కన్నపేటలోని కటుకూరి గ్రామ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోతులు ఆడుకుంటూ పైకప్పుపైకి దూకడం వల్ల బండరాయి బోల్తా పడింది. ఆ సమయంలో రజిత, శ్రీకాంత్‌ దంపతుల కుమారుడు దేవునూరి అభినవ్‌ తన ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి బాలుడి తలపై పడింది. బండరాయి తలపై పడడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి బాలుడు విగతజీవిగా కనిపించడంతో వారు బోరున విలపించారు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Metro Train : మెట్రో రైలులో లేని సీటు..సోఫాతో ప్రయాణం చేస్తున్న యువకుడు

ఇదిలా ఉండగా.. ఆరు నెలల క్రితం అభినవ్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ బాలుడికి ప్రమాదవశాత్తు కత్తి గొంతు గుచ్చుకుంది. రూ. 5 లక్షలతో శస్త్రచికిత్స చేయించి తల్లిదండ్రులు కుమారుడిని కాపాడుకున్నారు. ప్రస్తుతం ఆ కత్తి గాయాల నుంచి పూర్తిగా కోలుకోగా.. మళ్లీ ఇప్పుడు ఆ సంఘటనను మరిచిపోకముందే మృత్యువు బాలుడిని వెంటాడింది. ఈ నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది. చాలా కాలంగా కోతుల బెడదతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు వాపోయారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు.