NTV Telugu Site icon

Dhoom-Style Robbery: ‘ధూమ్’ స్టైల్ దొంగతనం.. కదులుతున్న ట్రక్కులో ఎక్కి చోరీ..

Viral

Viral

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బైక్ పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి చోరీ చేశారు. ట్రక్కు వెనుక కారు నడుపుతున్న ప్రయాణికులు ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, దొంగలు ట్రక్కు నుంచి వస్తువులను దొంగిలించడం కనిపిస్తుంది. ఈ వీడియో ఫుటేజీలో.. ఇద్దరు వ్యక్తులు దొంగిలించబడిన వస్తువులను ట్రక్కు పై నుంచి రోడ్డుపై విసిరివేయడం మనం చూడొచ్చు. మూడవ వ్యక్తి బైక్ పై వెనుక వస్తున్నాడు. ట్రక్కులోంచి సామాన్లు విసిరిన తర్వాత ఇద్దరు దొంగలు వేగంగా వస్తున్న ట్రక్కు నుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్లిపోయారు.

Read Also: Karthi New Movie: ’96’ డైరెక్ట‌ర్‌తో కార్తీ.. సినిమా పేరు, ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌!

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చోరీలు మామూలేనని కొందరు అభిప్రాయపడుతుంటే.. ఈ చోరీలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని మరికొందరు అంటున్నారు. అయితే, షాజాపూర్ మధ్య హైవేపై పట్టపగలే దొంగతనాలు జరగటం మామూలేనంటూ స్థానకులు తెలియజేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్లు కూడా దొంగతనంపై చాలా ఫిర్యాదులు చేసిన.. ఇక్కడి పోలీసులు పట్టించుకోరని పేర్కొన్నారు. అయితే, తాజా వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ రహదారిపై ప్రతిరోజూ దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.